న్యూస్

తమిళ్ లో 3rd హైయెస్ట్ రేటు…..లాస్ట్ మినట్ లో షాక్ ఇచ్చారుగా!

తెలుగు లో కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ రాగా, లాస్ట్ ఇయర్ నుండే పరిస్థితులను అర్ధం చేసుకున్న ఇతర ఇండస్ట్రీలలో కొన్ని క్రేజీ సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ లను సొంతం చేసుకున్నాయి. కోలివుడ్ విషయానికి వస్తే సూర్య, ధనుష్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ లో…

రిలీజ్ అయ్యాయి, అలా రిలీజ్ లను సొంతం చేసుకున్న సినిమాలలో ధనుష్ జగమే తంత్రం సినిమా కోలివుడ్ తరుపున హైయెస్ట్ డిజిటల్ రేటు ని సొంతం చేసుకోగా తర్వాత సూర్య నటించిన ఆకాశం నీ హద్దుగా సినిమా రెండో ప్లేస్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది…

ఈ సినిమాల తర్వాత మూడో హైయెస్ట్ రేటు ని శివకార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ సొంతం చేసుకుంది, ఈ సినిమా డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయిందని నిన్న మొన్నటి దాకా వార్తలు వచ్చాయి. ఏకంగా 42 కోట్ల రేటు తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నారని అన్నారు…

కానీ ఇప్పుడు చివరి నిమిషంలో కోలివుడ్ తరుపున మూడో హైయెస్ట్ రేటు ని సైతం నో చెప్పి సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ఫిక్స్ అయ్యాడు హీరో… దాంతో 42 కోట్ల ఆఫర్ కి నో చెప్పి సినిమాను ఇప్పుడు అక్టోబర్ 9 న దసరా కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది…

రీసెంట్ గా సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫాం చేయడంతో డిజిటల్ రిలీజ్ కాన్సిల్ అయిందని కన్ఫాం అవ్వగా ఈ సినిమాను తెలుగు లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని సమాచారం ఉంది, సినిమాలో చెల్లమ్మ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో సినిమా పై క్రేజ్ ఇక్కడ కూడా బాగానే ఉంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…

Leave a Comment