న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

తమిళ గడ్డపై అత్యధిక బిజినెస్ చేసిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే!!

ఇతర ఇండస్ట్రీ ల నుండి డబ్బింగ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో ఉన్నంత బిజినెస్ మన సినిమా లకు ఇతర భాషల్లో లేవనే చెప్పాలి. ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరోల సినిమాలకు తెలుగు లో రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ లు క్రమంగా జరగడం జరుగు తూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం కానీ మన సినిమాలకు మాత్రం అక్కడ ఒకటీ అరా సినిమా లు తప్పిస్తే చాలా సినిమా లకు తక్కువ బిజినెస్ లే జరుగుతూ వస్తున్నాయి.

బాహుబలి వలన అక్కడ మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరగగా దాన్ని వాడుకున్న సినిమాలు కూడా తక్కువే అని చెప్పాలి. కొన్ని సినిమాల రిజల్ట్ లు తేడా కొట్టడం తో అక్కడ డబ్ చేయడం మన వాళ్ళు చాలా తక్కువ చేశారు, దాంతో అది బిజినెస్ పై మరింత ఇంపాక్ట్ చూపుతుంది.

సినిమాల బిజినెస్ లు అటు కలెక్షన్స్ కూడా అనుకున్న రేంజ్ లో అక్కడ రావడం లేదు, కానీ తమిళ్ మూవీస్ తెలుగు లో క్రమంగా రిలీజ్ అవుతూనే ఉండటం తో టాక్ బాగుంటే ఇక్కడ ఎగబడి భాషా భేదం లేకుండా ఆ సినిమాలను చూడటం ఖాయం. ఇక తమిళ్ లో తెలుగు సినిమాల పరంగా…

హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను సొంతం చేసుకున్న టాప్ 5 తెలుగు సినిమాలను ఒకసారి గమనిస్తే. బాహుబలి 2 37 కోట్ల బిజినెస్ తో టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో మహేష్ స్పైడర్ 18 కోట్ల బిజినెస్ తో టాప్ 2 లో ఉంది, ఇక ప్రభాస్ సాహో 15 కోట్ల బిజినెస్ తో ఉండగా 4 వ ప్లేస్ లో బాహుబలి 1 సినిమా 13 కోట్ల బిజినెస్ తో నిలిచింది.

ఇక 5 వ ప్లేస్ లో సైరా నర సింహా రెడ్డి సినిమా కి 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ దక్కగా మొత్తం మీద ఇవి అక్కడ హైయెస్ట్ బిజినెస్ లను సాధించిన సినిమాలు… ఇక్కడ ఒకటి గమనిస్తే… అన్ని సినిమాలు కూడా తమిళ్ లో కూడా రూపొందటం వలనే అంత బిజినెస్ లు సాధించాయి, మాములుగా డబ్ అయితే ఒక్క అరుంధతి సినిమా మాత్రమె 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని అందుకుంది… మరి ఫ్యూచర్ లో అయినా పరిస్థితి ఏమైనా మారుతుందేమో చూడాలి ఇక..

Leave a Comment