న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

తలపోటు వస్తుంటే….దర్శకుడు మాత్రం గర్వపడుతున్నాడు

రీసెంట్ గా వచ్చిన సూర్య NGK సినిమా రిజల్ట్ ఎలా ఉందొ అందరికీ తెలిసిందే, తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా, ఆ టాక్ పక్కకు పెడితే ఇలాంటి సినిమా అసలు సూర్య ఎందుకు ఒప్పుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో ఒక సీన్ కి ఒక సీన్ లింక్ లేదని, సాయి పల్లవి క్యారెక్టర్ అస్సలు బాలేదని, అసలు దర్శకుడు ఏం కన్వే చేయాలనుకున్నాడు అంటూ తల పట్టుకున్నారు.

కానీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ మాత్రం సోషల్ మీడియా లో ఈ సినిమా ని ఆదరిస్తున్న వారికి సినిమాలో ఉన్న టర్నింగ్ పాయింట్స్ ని అర్ధం చేసుకున్న వాళ్లకి థాంక్స్ చెబుతూ… ఇలాంటి సినిమా తీసినందుకు సంతోషంగా గర్వంగా ఉందని చెబుతున్నాడట.

సూర్య ఫ్యాన్స్ కూడా గత కొన్ని ఫ్లాఫ్స్ కి ఈ సినిమా తో మంచి కంబ్యాక్ దొరుకుంతుంది అనుకున్నా సినిమా పాత మూవీస్ ని మించిన డిసాస్టర్ అయినా డైరెక్టర్ చేస్తున్న కామెంట్స్ కి సోషల్ మీడియా లో రిటర్న్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సూర్య కి మాత్రం NGK భారీ ఎదురుదెబ్బ కొట్టింది అన్నది మాత్రం అక్షర సత్యం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment