న్యూస్ బాక్స్ ఆఫీస్

తిప్పరా మీసం కలెక్షన్స్…టార్గెట్ 2.5 కోట్లు…ఫస్ట్ డే వచ్చింది ఇది!!

గత కొంత కాలంగా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో మంచి సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న హీరో శ్రీ విష్ణు నటించిన సరికొత్త సినిమా తిప్పరా మీసం. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, ఇక కలెక్షన్స్ పరంగా కూడా మొదటి రోజు ఊహించని షాకింగ్ కలెక్షన్స్ ని అందుకుని షాక్ ఇచ్చింది తిప్పరా మీసం సినిమా.

సినిమా మొదటి రోజే డిసాస్టర్ ఓపెనింగ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది, మరీ భారీ ఓపెనింగ్స్ కాకున్నా కానీ డీసెంట్ ఓపెనింగ్స్ అయినా వస్తాయి అనుకుంటే కేవలం 22 లక్షల షేర్ ని సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాలలో అందుకుంది. కాగా ఈ కలెక్షన్స్ ఈ ఇయర్ శ్రీవిష్ణు సూపర్ హిట్…

బ్రోచేవారెవరురా మొదటి రోజు 35 లక్షల తో పోల్చితే చాలా తక్కువే అని చెప్పాలి. ఆ సినిమా కూడా సైలెంట్ గానే రిలీజ్ అయినా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక తిప్పరా మీసం వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కేవలం 26 లక్షల రేంజ్ షేర్ నే సాధించి షాక్ ఇచ్చింది.

సినిమా బిజినెస్ వివరాలు క్లియర్ గా రిలీజ్ చేయకున్నా కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఓవరాల్ బిజినెస్ 2.1 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక మొదటి రోజే డిసాస్టర్ స్టార్ట్ అందుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 2.24 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో అందుకోవాల్సి ఉంటుంది, టాక్ పూర్తిగా నెగటివ్ గా ఉండటం తో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం దాదాపుగా అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

Leave a Comment