టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

తిమ్మరుసు టోటల్ కలెక్షన్స్…హిట్ టాక్…కానీ!

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ మూవీ సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమా.. సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా కి తర్వాత డిజిటల్ రిలీజ్ కి గాను ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పి థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి సెకెండ్ పాండమిక్ తర్వాత థియేటర్స్ లో ఈ సినిమాను దింపారు. సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే…

మంచి పాజిటివ్ టాక్ లభించింది కానీ ఓపెనింగ్స్ నుండే అంతంత మాత్రంగా పెర్ఫార్మ్ చేస్తూ వచ్చిన ఈ సినిమా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని పెంచేలేక పోయింది. దానికి తోడూ ఈ సినిమా వచ్చిన వారం తరువాత వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడం తో…

ఈ సినిమా కలెక్షన్స్ పై అది ఇంపాక్ట్ చూపింది. ఒక సినిమా టోటల్ కలెక్షన్స్ సమ్మరీని గమనిస్తే
👉Movie Business: 2.4Cr~
👉Break Even: 2.6Cr
👉AP TG Total Share: 1.86Cr
👉WW Share : 2.18Cr
👉Total Gross : 3.55Cr~
👉Total Loss: 0.42Cr
👉Movie Verdict: Average

ఇక తిమ్మరుసు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 0.69Cr
👉Ceeded: 0.22Cr
👉UA: 0.28Cr
👉East: 0.17Cr
👉West: 0.11Cr
👉Guntur: 0.19Cr
👉Krishna: 0.12Cr
👉Nellore: 0.08Cr
AP-TG Total:- 1.86CR(2.95Cr Gross~)
Ka+ROI – 8L
Os – 24L
Total – 2.18Cr(3.55Cr~ Gross) ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్.

సినిమా బిజినెస్ ను తగ్గించారు అంటూ వార్తలు వచ్చినా అవి రూమర్స్ గానే మిగిలిపోగా సినిమా 2.4 కోట్ల బిజినెస్ లో 22 లక్షలు నష్టపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను అందుకుంది. సినిమా కి ఇంకొంచం బెటర్ ప్రమోషన్స్ జరిగి ఉంటే కచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని ఉండేది.

Leave a Comment