న్యూస్

తిమ్మరుసు ట్రైలర్ రివ్యూ…కుమ్మింది ట్రైలర్!

సైడ్ రోల్స్ నుండి హీరోగా ఎదగడం అన్నది చాలా కొద్ది మందికి మాత్రమె సాధ్యం అవుతుంది, అలాంటి నటులలో ఇప్పుడు సత్యదేవ్ కూడా ఒకరని చెప్పాలి. చిన్న చిన్న రోల్స్ నుండి సైడ్ రోల్స్ కి సైడ్ రోల్స్ నుండి మెయిన్ లీడ్ రోల్స్ కి ఎదిగిన సత్యదేవ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా డిజిటల్ హిట్ తర్వాత వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ దూసుకు పోతుండగా…

వాటిలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తిమ్మరుసు అనే సినిమా ఈ సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఫస్ట్ మూవీ గా నిలిచింది. రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి.

ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. సినిమా ట్రైలర్ లో సినిమా స్టొరీ పాయింట్ ని ఆల్ మోస్ట్ రివీల్ చేశారు అని చెప్పొచ్చు.

సిన్సియర్ లాయర్ అయిన హీరో ఓ 8 ఏళ్ల క్రితం ఆగిపోయిన కేసుని తిరిగి రీ ఓపెన్ చేస్తాడు, ఆ కేసు తన లైఫ్ లో ఎలాంటి అవరోధాలను క్రియేట్ చేసింది, వాటినన్నంటినీ ఎదిరించి హీరో ఎలా ఆ కేసుని సాల్వ్ చేశాడు. ఇంతకీ ఆ కేసు లో ఏముంది లాంటి ఆసక్తి కరమైన సన్నివేశాలతో, మంచి క్వాలిటీ విజువల్స్ తో సాలిడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో…

ట్రైలర్ బాగా మెప్పించింది అని చెప్పాలి. చిన్న సినిమానే అయినా క్వాలిటీ అదిరి పోవడం విశేషమని చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న ఎక్స్ పెర్టేషన్స్ ని పెంచింది అని చెప్పాలి. ఇక ఈ నెల 30 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న తిమ్మరుసు సినిమా తిరిగి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే కెపాసిటీ ఉన్న సినిమా అనిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Leave a Comment