న్యూస్

తిమ్మరుసు సెన్సార్ కంప్లీట్…ఫస్ట్ టాక్ ఏంటంటే!

కెరీర్ ని చిన్న రోల్స్ నుండి సైడ్ రోల్స్ కి తర్వాత మెయిన్ లీడ్ గా ఎదిగిన వాళ్ళలో సత్యదేవ్ ఒకరు… చిన్న రోల్స్ నుండి వరుస పెట్టి మెయిన్ లీడ్ రోల్స్ తో దూసుకు పోతున్న సత్యదేవ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా డిజిటల్ హిట్ తర్వాత రెట్టించిన జోరు తో దూసుకు పోతున్నాడు. ఆ సినిమా తర్వాత రిలీజ్ చేసిన మిగిలిన డిజిటల్ రిలీజ్ లకు….

మరీ అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రాకున్నా కానీ వరుస పెట్టి ఛాన్సులు కొట్టేసిన సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ తిమ్మరుసు ఎప్పుడో సమ్మర్ కానుకగా రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన ఆగి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత రిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా నిలిచింది.

ఈ నెల 30 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ పనులను రీసెంట్ గా కంప్లీట్ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చింది. ఓ సిన్సియర్ లాయర్ అతి కష్టమైనా కేస్ ను టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఎలాంటి…

పరిస్థితులు ఏర్పడ్డాయి, ఆవన్నీ హీరో ఎలా సాల్వ్ చేశాడు… ఇంతకీ హీరో మంచి వాడా లేక చెడ్డవాడా అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన తిమ్మరుసు ఫస్టాఫ్ బాగుందని సెకెండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే పర్వాలేదని అంటున్నారు. సత్యదేవ్ నటన డైలాగ్స్ హైలెట్ కాగా చిన్న సినిమానే అయినా క్వాలిటీ బాగుండటం తిమ్మరుసు కి బాగా ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

ఓవరాల్ గా లాయర్ బ్యాగ్ డ్రాప్ లో మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా బాగానే మెప్పిస్తుందని అంటున్నారు. సెన్సార్ నుండి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటున్న తిమ్మరుసు బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను తిరిగి రప్పించాల్సిన అవసరంతో బరిలోకి దిగుతుంది, మరి ఎంతవరకు అంచనాలను తట్టుకుని జనాలను థియేటర్స్ రప్పించి మెప్పిస్తుందో చూడాలి ఇక.

Leave a Comment