గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

తూచ్ 2 కోట్లు కాదు 5 కోట్లు అంటున్న దేవరకొండ!!

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అటు హీరోగా యమ బిజీ గా ఉండగా ఇంతలో సడెన్ గా నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ మీకు మాత్రమె చెబుతా… అతి తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా కేవలం విజయ్ దేవరకొండ క్రేజ్ వలెనే మంచి బజ్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా సినిమా రిజల్ట్ గురించి పక్కకు పెడితే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి…

మాత్రం చాలా మంది విజయ్ ని ఎకేశారు, చాలా తక్కువ బడ్జెట్ లో నాసిరకనంగా సినిమాను నిర్మించారని విమర్శించారు, ఇవి తిరిగి తిరిగి విజయ్ దేవరకొండ వరకు వెళ్ళగా రీసెంట్ గా సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా కోసం ఎంత ఖర్చు చేశామో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

సినిమా ను కేవలం 2 కోట్ల లోపు బడ్జెట్ లో రూపొందించారని బయట టాక్ ఉండగా విజయ్ దేవరకొండ మాత్రం తూచ్ అది అబద్దం అని సినిమా కి భారీ గా ఖర్చు చేశామని, తన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సినిమాని నిర్మించామని, అక్షరాలా సినిమా బడ్జెట్ 5 కోట్ల వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అది విన్న విశ్లేషకులు అంతలా బడ్జెట్ సినిమాలో ఎక్కడ ఖర్చు చేశారని అంటున్నారు. ఇక సినిమా మొదటి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల షేర్ ని ఆల్ మోస్ట్ 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా యూనిట్ వర్గాలు సినిమా ఏకంగా 4 కోట్ల రేంజ్ లో..

వసూళ్ళ ని సాధించని అప్ డేట్ చేశారు, దాంతో అంత ఎక్కడ నుండి వచ్చింది అందరు షాక్ అవుతున్నారు. ఆ కలెక్షన్స్ ఎలా పబ్లిసిటీ కోసం చెప్పారో బడ్జెట్ కూడా అలానే చెప్పి ఉంటారని అంటున్నారు. ఇక హీరో గా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.

Leave a Comment