న్యూస్ రివ్యూ

తెనాలి రామకృష్ణ రివ్యూ….పారిపోండిరోయ్!!

మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు, ఈ ఇయర్ నిను వీడని నీడను నేనే తో పర్వాలేదు అనిపించే హిట్ కొట్టిన సందీప్ ఇప్పుడు కమర్షియల్ హిట్ కోసం తెలాని రామకృష్ణ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సినిమా వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల బిజినెస్ చేయగా నేడు భారీ ఎత్తున రిలీజ్ అయిన సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ..

ముందుగా స్టొరీ లైన్ కి వస్తే టాలెంట్ ఉన్నా సరైన కేసు తగలక కోర్ట్ బయట సెటిల్ మెంట్స్ తో డబ్బులు సంపాదించే హీరో కి అనుకోకుండా ఒక మర్డర్ కేస్ లో ఇరుక్కున్న వరలక్ష్మీ శరత్ కుమార్ కేసు వస్తుంది, మరి ఆ కేసు లో హీరో ఎలా గెలిచాడు, ఆ మర్డర్ కి వరలక్ష్మీ కి లింక్ ఏంటి, హీరోయిన్ రోల్ ఏంటి అనేవి ఓవరాల్ గా సినిమా కథ.

చాలా అంటే చాలా సింపుల్ స్టొరీ లైన్ ని 2 గంటల పాటు నాన్ స్టాప్ నవ్విస్తాం అంటూ చెప్పిన యూనిట్ సినిమా మొత్తం మీద పట్టుమని 20 నిమిషాలు కూడా నవ్వించలేకపోయింది, ఉన్నంతలో ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ నీరసమైన స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు.

పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్ పర్వాలేదు అనిపించగా హన్సిక పెర్ఫార్మెన్స్ మరీ ఓవర్ గా ఉందనిపిస్తుంది. ఇక ఇతర రోల్స్ లో సత్య కృష్ణన్ కామెడీ సీన్స్ 2 అద్బుతంగా అనిపించగా మిగిలిన రోల్స్ అన్నీ జస్ట్ ఉన్నాం అంటే ఉన్నాం అనిపించేలా ఉన్నాయి. ఇక సంగీతం యావరేజ్ గా ఉండగా..

బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింతగా సరి చూసుకోవాల్సి ఉండేది, సినిమా 2 గంటలే ఉన్నా కానీ బోర్ కొట్టే సీన్స్ చాలానే ఉన్నాయి, అలాగే స్క్రీన్ ప్లే ఎటు నుండి ఎటు పోతుందో అర్ధం అవ్వదు, సెకెండ్ ఆఫ్ మరింత కేర్ తీసుకుంటే బాగుండేది.

ఇక డైరెక్షన్ పరంగా నాగేశ్వర రెడ్డి కొన్ని సీన్స్ వరకు ఆకట్టుకునే కామెడీ తో మెప్పించినా ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం రొటీన్ కథ ని దానికన్నా రొటీన్ నరేషన్ తో ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఉన్నంతలో కొన్ని కామెడీ సీన్స్ అలాగే కొన్ని మంచి సన్నివేశాలు సినిమా ను చివరి వరకు చూసేలా చేశాయి.

మొత్తం మీద సినిమా కొన్ని కామెడీ సీన్స్ కోసం, కొన్ని చిన్న చిన్న ట్విస్ట్ ల కోసం ఒకసారి కష్టపడి చూసే విధంగా ఉంది, ఆ మాత్రం కామెడీ జబర్దస్త్ వీడియో లు చూస్తె నవ్వురాదా అంటే ఈజీగా స్కిప్ కొట్టేయోచ్చు. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…

Leave a Comment