న్యూస్ బాక్స్ ఆఫీస్

తెనాలి రామక్రిష్ణ కలెక్షన్స్: టార్గెట్ 5 కోట్లు…ఫస్ట్ డే వచ్చింది ఇది!!

ఈ ఇయర్ నిను వీడని నీడను నేను సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని కంబ్యాక్ ఇచ్చాడు సందీప్ కిషన్. ఆ ఊపులో ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా తెనాలి రామక్రిష్ణ అంటూ కామెడీ ఎంటర్ టైనర్ తో రాగా సినిమా కి మార్నింగ్ షోల కే మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి దక్కగా ఆ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు గట్టిగానే కనిపించింది, సినిమా మొదటి రోజు మొత్తం మీద…

అన్ని చోట్లా పెద్దగా ఆశించిన కలెక్షన్స్ ని అందుకోవడం లో విఫలం అయింది, సినిమా రెండు రాష్ట్రాలలో అనుకున్నట్లే 50 లక్షలకు పైగా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా చాలా నీరసమైన కలెక్షన్స్ ని అందుకుని తొలిరోజు కేవలం 60 లక్షల లోపు షేర్ తోనే సరి పెట్టుకుంది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే
?Nizam: 21L
?Ceeded: 6L
?UA: 7L
?East: 5.2L
?West: 3.8L
?Guntur: 4.2L
?Krishna: 5.1L
?Nellore: 3L
AP-TG Day 1:- 0.55Cr
Ka & ROI: 3L
OS: 1L
Total WW: 0.59CR(0.92cr Gross)

ఇదీ మొత్తం మీద మొదటి రోజు తెనాలి రామ కృష్ణ సినిమా కలెక్షన్స్ లెక్కలు. ఈ కలెక్షన్స్ సినిమా టార్గెట్ ని అందుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. సినిమా ను టోటల్ గా 4.5 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాలి.

కానీ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ చూసిన తర్వాత సినిమా మిగిలిన రన్ లో మరో 4.41 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది జరగాలి అంటే వీకెండ్ భారీగా హోల్డ్ చేసి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సినిమా స్టడీ కలెక్షన్స్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Leave a Comment