న్యూస్ బాక్స్ ఆఫీస్

తెలుగు ఇండస్ట్రీ హిట్…తమిళ్ లో రీమేక్…సినిమాకి లాస్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

సరిగ్గా ఓ 12 ఏళ్ల వెనక్కి వెళితే…. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సృష్టించిన ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందా అని ఎదురు చూసే సమయం లో ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ పడకుండా ఊచకోత కోసి మగధీర టోటల్ రన్ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పవర్ స్టార్ అత్తారింటికి దారేది రికార్డ్ రెండేళ్ళు కొనసాగి దుమ్ము లేపింది.

అలాంటి సినిమా ను 2019 లో తమిళ్ లో రీమేక్ చేశారు… శింబు హీరోగా రీమేక్ చేసిన ఈ సినిమా కి వందా రాజా వదాన్ వరువేన్ పేరుతో భారీ లెవల్ లో రీమేక్ చేయగా మొదటి ఆటకే సినిమా అక్కడ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా కోలుకోలేదు.

వందా రాజా వదాన్ వరువేన్ సినిమా ను అక్కడ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన లైకా వారు 1 కోటి రేటు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకోగా సినిమాను ఏకంగా 35 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీ గా రూపొందించి థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లకు సినిమా ను అమ్మారు. కాగా సినిమా ఫైనల్ రన్ లో..

కేవలం 9 కోట్ల షేర్ ని మాత్రమె రాబట్టి 21 కోట్ల నష్టాన్ని మిగిలించింది. ఈ విషయానికి తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేయడం తో తెలుగు లో అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ను రీమేక్ చేసి రిలీజ్ చేసినా ఇలాంటి రిజల్ట్ ఏంటి అనేది అందరికీ ఒకింత షాక్ ని గురి చేసింది. తెలుగు లో సినిమా అంతటి విజయాన్ని నమోదు చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పాలి.

కానీ అన్నింటిలోకి సినిమాలో కథ కొంచం వీక్ గా ఉన్నా ఇక్కడ పవర్ స్టార్ తన స్టామినా తో నిలబెట్టాడు, దేవి శ్రీ ప్రసాద్ వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ మ్యూజిక్ తో దుమ్ము లేపాడు. త్రివిక్రమ్ తన డైలాగ్స్ తో టేకింగ్ తో సినిమా ను అంచనాలను అందుకునేలా చేశాడు. కానీ తమిళ్ లో శింబు స్టార్ డం సినిమాను నిలబెట్టలేక ఇండస్ట్రీ హిట్ రీమేక్ ని డిసాస్టర్ అయ్యేలా చేసింది.

Leave a Comment