న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ వీక్ హైయెస్ట్ షేర్ సాధించిన టాప్ 10 మూవీస్!

బాహుబలి రాకతో తెలుగు సినిమాల మార్కెట్ ఎక్స్ పాన్షన్ ఓ రేంజ్ లో జరిగి పోగా తర్వాత మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ళ తో రికార్డు లను నమోదు చేయడం మనం చూస్ తూనే ఉన్నాం… టాప్ హీరోల సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్న ప్రతీ సారి సాలిడ్ కలెక్షన్స్ ని మొదటి వారం లో అందు కుని రికార్డు లను సృష్టించాయి.

ఇక రీసెంట్ గా వచ్చిన సంక్రాంతి మూవీస్ కి వీకెండ్ రిలీజ్ కి తోడూ పండగ వీక్ మిడిల్ లో రావడం కూడా కలిసి వచ్చి ఇప్పుడు అల్టిమేట్ రికార్డులను మొదటి వారం లోనే అందుకుని రికార్డులు సృష్టించాయి. సరిలేరు నీకెవ్వరు ఒక రోజు ముందు రిలీజ్ అవ్వడం తో…

మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డులను తిరగారాసినా తర్వాత వచ్చిన అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు నుండి ప్రతీ రోజు కొత్త రికార్డును నమోదు చేసి సత్తా చాటుకుంది. మొత్తం మీద మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు సినిమాలు సాలిడ్ రికార్డులను అందుకుని సంచలనం సృష్టించాయి.

ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం టాప్ 10 షేర్ వసూల్ చేసిన సినిమాలను గమనిస్తే
?#Baahubali2-117.92Cr
?#AlaVaikunthapurramuloo- 88.25Cr**
?#SarileruNeekevvaru– 84.82Cr**
?#Syeraa-84.49Cr
?#Saaho– 74.92Cr
?#Baahubali-61.40Cr
?#Maharshi: 59.07Cr
?#Rangasthalam: 58.76Cr
?#AravindaSametha: 58.49Cr
?#KhaidiNo150: 56.50Cr
ఇదీ సంక్రాంతి సినిమాల సెన్సేషనల్ రికార్డ్ కలెక్షన్స్ మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాలలో…

రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ ని కూడా మించిపోగా…అల వైకుంఠ పురం లో వారం లోనే అన్ని రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించి దుమ్ము లేపింది. లాంగ్ రన్ లో రెండు సినిమాలు మరిన్ని రికార్డులను నమోదు చేసి చరిత్ర సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Comment