న్యూస్ స్పెషల్

తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి…40 ఔట్ అక్కడా!!

ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ అటు రామ్ చరణ్ లు ఇద్దరూ ఇప్పటికే చాలా సమయం ఈ సినిమా కోసం కేటాయించగా ఎన్టీఆర్ మరింత ఎక్కువ టైం ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ కోసం మరింత ఎక్కువగా ఎదురు చూస్తూ ఉండగా…

లాస్ట్ ఇయర్ కొమరం భీమ్ పుట్టిన రోజున ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ను రిలీజ్ చేయగా యూట్యూబ్ మొత్తం షేక్ అయ్యింది, తొలి 24 గంటల్లో సంచలన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ టీసర్ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సంచలన రికార్డులను కంటిన్యూ చేస్తూ వచ్చింది.

ఈ క్రమం లో మరిన్ని రికార్డులు యాడ్ అవుతూ రాగా టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ టీసర్ గా నిలిచిన ఈ టీసర్ తర్వాత మొట్ట మొదటి 1 మిలియన్ కామెంట్స్ మార్క్ ని అందుకున్న టీసర్ గా నిలిచింది. ఇక తర్వాత టాలీవుడ్ లో…

హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కూడా నిలిచింది ఈ టీసర్… ఇక ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ తెలుగు సినిమా హిస్టరీ లో మొట్ట మొదటి 40 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకున్న టీసర్ గా మరో అరుదైన రికార్డ్ ను దక్కించుకుంది కొమరం భీమ్ ఇంట్రో టీసర్. టాలీవుడ్ లో టీసర్ ల రికార్డుల పరంగా అన్ని రికార్డులను తుడిచి పెట్టింది…

ఎన్టీఆర్ ఇంట్రో టీసర్… ఇక సినిమాలో మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లు రిలీజ్ అవ్వాల్సి ఉండగా వాటికే బిగ్గెస్ట్ టార్గెట్ లు సెట్ చేసి పెట్టింది. మరి అఫీషియల్ టీసర్ అండ్ ట్రైలర్ లు మరెలాంటి రికార్డులను నమోదు చేస్తాయి అన్నది ఆసక్తిగా మారగా ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ తో పాటు రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కూడా ఇప్పుడు త్వరలో 40 మిలియన్స్ మార్క్ ని అందుకోబోతుంది.

Leave a Comment