న్యూస్

థియేటర్స్ లో డిసాస్టర్ మూవీ…కానీ ఇక్కడ రెస్పాన్స్ సాలిడ్ గా వచ్చిందే!!

అదేంటో ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్న సినిమాలు డిజిటల్ రిలీజ్ లో మాత్రం సాలిడ్ వ్యూస్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి, బహుశా వరుస పెట్టి రిలీజ్ అవుతున్న సినిమాల్లో చాలా వరకు ఆడియన్స్ థియేటర్స్ లో చూడక పోవడం ఒక కారణం కావొచ్చు అని చెప్పాలి. అయినా కానీ కొద్ది గ్యాప్ తోనే డిజిటల్ లో కూడా సినిమాలు వచ్చేస్తూ ఉండటం తో…

ఆడియన్స్ థియేటర్స్ కి పని గట్టుకుని వెళ్ళే ఆలోచన చెయడం చాలా తక్కువగా చేస్తున్నారు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో వచ్చిన కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా తొలి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకుని…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా సినిమా బిజినెస్ ను అందుకునేలా పరుగును కొనసాగించలేక పోయింది. దాంతో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది. అదే సినిమా త్వరగానే డిజిటల్ రిలీజ్ లో కొన్ని మార్పులు చేర్పులతో వదిలారు కానీ రెస్పాన్స్ అయితే థియేటర్స్ లో వచ్చినట్లే వచ్చింది…

ఆ రెస్పాన్స్ మాట ఎలా ఉన్నప్పటికీ కూడా సినిమా కి వ్యూవర్ షిప్ మాత్రం అదిరిపోయే విధంగా వచ్చింది అని చెప్పాలి. సినిమా కి మొదటి వీకెండ్ లోనే ఆల్ మోస్ట్ 1 లక్షా 80 వేల దాకా యూనిక్ వ్యూస్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. ఇక మొదటి వారం లోనే సినిమా కి ఆల్ మోస్ట్ 3 లక్షల రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు.

3 లక్షల రేంజ్ వ్యూస్ అంటే మాములు విషయం కాదు, ఆహా యాప్ 1 ఇయర్ కి 365 రేటు ని ఒక నెల కి 50 రేటు అనుకుంటే 3 లక్షల వ్యూస్ కి 1.5 కోట్ల రేంజ్ లో రెవెన్యూ వచ్చి ఉండొచ్చని అంచనా వేయవచ్చు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినా కానీ డిజిటల్ లో సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతుంది ఈ సినిమా.

Leave a Comment