న్యూస్ స్పెషల్

థియేటర్స్ లో రిలీజ్ కాలేదు…2 సార్లు డీసెంట్ TRP తో కుమ్మేసిన శక్తి మూవీ!

ఈ ఇయర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు ఆల్ మోస్ట్ వచ్చినట్లే వచ్చి చివరి నిమిషం లో కరోనా ఎఫెక్ట్ తో రిలీజ్ ఆగిపోయిన సినిమాల్లో డబ్బింగ్ మూవీ శక్తి కూడా ఒకటి…తర్వాత చేసేదేమీ లేక డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల అక్కడ నుండి తొలగించబడి తిరిగి మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వచ్చేయగా టెలివిజన్ లో మాత్రం సైలెంట్ గా…

ఇప్పటి వరకు 2 సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమా రెండు సార్లు కూడా డీసెంట్ TRP రేటింగ్ లతో మంచి హోల్డ్ ని సాధించి దుమ్ము లేపింది. కాగా సినిమా ను స్టార్ మా మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుందట.

కాగా ఇప్పటి వరకు సినిమా రెండు సార్లు టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా కి 4.34 TRP రేటింగ్ దక్కింది.. అప్పుడు లాక్ డౌన్ ఉండటం తో అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కి కూడా డీసెంట్ TRP రేటింగ్ దక్కింది అని చెప్పాలి.

ఇక సినిమా రీసెంట్ గా రెండో సారి కూడా టెలికాస్ట్ అవ్వగా మరోసారి హోల్డ్ చేసి 4.02 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది ఈ సినిమా. మొత్తం మీద రెండు సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమా రెండు సార్లు కూడా మంచి రేటింగ్స్ తోనే హోల్డ్ చేసింది. సినిమా కూడా క్లైమాక్స్ కొంచం వీక్ గా ఉన్నా కానీ…

ఓవరాల్ గా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా గా చెప్పుకోవచ్చు. విశాల్ తో అభిమన్యుడు తీసిన డైరెక్టర్ తీసిన తర్వాత సినిమా ఇది. ఖాళీ టైం లో కుదిరితే అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఉంటుంది, క్లైమాక్స్ కొంచం వీక్ గా ఉంటుంది కానీ ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్ మాత్రం బాగా నచ్చే అవకాశం ఉంటుంది…

Leave a Comment