న్యూస్ రివ్యూ వీడియో

దర్బార్ ట్రైలర్ రివ్యూ…అరాచకం అసలు!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రీసెంట్ మూవీస్ లో బెస్ట్ టీసర్ లేదా ట్రైలర్ కట్ ఏది అంటే మాత్రం కచ్చితంగా కబాలి అనే చెప్పాలి. ఆ సినిమా టీసర్ రిలీజ్ కు ముందు వరకు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ఒక్కసారి టీసర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు పీక్స్ కి వెళ్ళాయి. మళ్ళీ రజనికాంత్ నటించిన మూవీస్ లో అలాంటి టీసర్ కట్ కానీ ట్రైలర్ కానీ పడలేదు…

పేట బాగానే ఉన్నా మరీ అనుకున్న రేంజ్ లో పేలలేదు. తెలుగు లో కూడా ఆకట్టుకోలేదు. ఇలాంటి టైం లో ఇప్పుడు ఏ ఆర్ మురగదాస్ తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ దర్బార్ అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయింది, ట్రైలర్ మొత్తం గూస్ బంప్స్ స్టఫ్ తో దుమ్ము లేపింది.

రీసెంట్ టైం లో తమిళ్ డబ్ మూవీస్ లో డబ్ మూవీ లా కాకుండా ఒక కమర్షియల్ తెలుగు మూవీ లా అనిపించిన ట్రైలర్ ఇదే… ట్రైలర్ లో మురగదాస్ రజినీ ని చూపెట్టిన విధానం గూస్ బంప్స్ తెప్పించాగా అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మరో లెవల్ లో ఉందని చెప్పాలి.

ఎలివేషన్ సీన్స్ దుమ్ము లేపాయి ట్రైలర్ లో… ఇక ముంబై నేపధ్యంలో సాగే పోలిస్ విలన్ ల కాన్సెప్ట్ సింపుల్ గానే ఉన్నా వింటేజ్ రజినీ ని చూపెట్టిన తీరు మాత్రం అదుర్స్ అనిపించింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 9 న రిలీజ్ కాబోతుంది. రోబో 2 తో రజినీ మెప్పించినా పేట తో నిరాశ పరిచాడు ఇక్కడ.

ఇలాంటి టైం లో ఈ సినిమా తిరిగి కంబ్యాక్ ఇచ్చే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న మూవీ లా అనిపిస్తున్నా ఎన్ని థియేటర్స్ ఇక్కడ దొరుకుతాయి అనేది ఆసక్తి కరం. ఇక ట్రైలర్ ని మీరు కూడా చూసేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment