గాసిప్స్ న్యూస్

దిల్ రాజు పై 3 కోట్ల కేసు?…వకీల్ సాబ్ వల్ల ఈ ఎఫెక్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ని అనేక అవరోధాలను ఎదురుకుని కూడా సొంతం చేసుకోగా, సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది, దాంతో ఇలాంటి టైం లో థియేటర్స్ లో ఆడుతున్నా కలెక్షన్స్ వచ్చేవి తక్కువే కాబట్టి అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రిలీజ్ ను ముందుకు జరిపితే…

సాలిడ్ రేటు ఇవ్వడానికి మేం సిద్ధం అంటూ చెప్పడం తో దిల్ రాజు సినిమాను 50 రోజుల కండీషన్ ను పక్కకు పెట్టి సినిమాను రిలీజ్ అయిన 21 వ రోజునే డిజిటల్ లో రిలీజ్ చేశారు. దాంతో నిర్మాతగా దిల్ రాజు కి మరింత భారీ మొత్తం ప్రాఫిట్ రూపంలో దక్కింది.

కానీ అదే సమయంలో తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మాకు సినిమా 50 రోజుల తర్వాతే రిలీజ్ అని చెప్పి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ కొంచం గొడవ చేసినా దిల్ రాజు వాళ్ళకి నచ్చజెప్పి పంపాడట, కానీ సినిమా గల్ఫ్ కంట్రీస్ లో రైట్స్ ని తీసుకున్న….

బయ్యర్లు మాత్రం మాకు సినిమా 50 రోజుల దాకా డిజిటల్ రిలీజ్ కాదని చెప్పి ఇప్పుడు 21 వ రోజునే రిలీజ్ చేయడం పై తీవ్రంగా మండి పడుతూ దీనిపై దిల్ రాజు పై చీటింగ్ కేసు పెడతామని, మాతో అలా చెప్పే రైట్స్ ని కొనేలా చేశారని, ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అంటూ 3 కోట్ల నష్టపరిహారం కేసు వేస్తామని చెబుతున్నారట. దాంతో ఇప్పుడు దిల్ రాజు…

వీటి పై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తిగా మారగా… అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోవడం తో నిర్మాత గా దిల్ రాజు తనకి న్యాయం అనిపించిన నిర్ణయం తీసుకోవడం తప్పేమీ కాదని చెప్పొచ్చు. నిర్మాత డబ్బులు పెట్టి సినిమాలు తీసేది ఆయనకి లాభాలు రావాలనే కదా… ఇక దిల్ రాజు కామెంట్స్ వీటి పై ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Leave a Comment