గాసిప్స్ న్యూస్

దిల్ రాజు ఫ్యామిలీ నుండి కొత్త హీరో లాంచ్…ఎన్ని కోట్లతో సినిమా తీస్తున్నారంటే!

ఇండస్ట్రీ నుండి కొత్త వాళ్ళు లాంచ్ అవ్వడం అన్నది సర్వ సాధారనంగా జరుగుతూనే ఉంటుంది, స్టార్ కిడ్స్ కానీ, ప్రొడ్యూసర్స్ సన్స్ కానీ, ఇండస్ట్రీ బయట వాళ్ళు కానీ ఎదో ఒక విధంగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాలని చూస్తారు, కొందరు మాత్రమె సక్సెస్ అవుతారు. ఇప్పుడు టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరో గా కొత్త కుర్రాడు లాంచ్ అవ్వడాని కి సిద్ధంగా ఉన్నాడు….

అతని పేరే ఆశిష్, దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు అయిన ఆశిష్ ను ఇప్పుడు ఇండస్ట్రీ కి హీరోగా లాంచ్ చేస్తూ రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ప్రెస్ మీట్ ని పెట్టి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. దిల్ రాజు ఓన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా లో…

ఆశిష్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా కి టైటిల్ గా రౌడీ బాయ్స్ అనే పేరు ని కన్ఫాం చేశారు. అక్టోబర్ లో దసరా టైం లో ఈ సినిమా ను ఆడియన్స్ ముందుకు తేవాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ నే పెట్టి తీస్తున్నారని టాలీవుడ్ లో టాక్ ఉంది, ఏకంగా 18 నుండి 20 కోట్ల రేంజ్ బడ్జెట్ లో లావిష్ గా ఈ సినిమాను తీశారని, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయని, స్టార్ కాస్ట్ కూడా బాగా ఉంటుందని అంటున్నారు. హీరో లుక్స్ పరంగా ఫస్ట్ ఇంప్రెషన్ తో పర్వాలేదు అనిపించాడు అని చెప్పాలి. ఇక నటన ఎలా ఉంది అన్నది…

సినిమా చూసిన తర్వాత చెప్పొచ్చు. ఇప్పటికే ఇండస్ట్రీ లో ఉన్న హీరోల కౌంట్ పెరిగి పోతుంది, ఇంకా కొత్తవాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు స్టార్ కిడ్స్ తో పాటు ప్రొడక్షన్ హౌసెస్ నుండి కూడా కొత్త హీరోలు వస్తున్నారు. కానీ ఎవరిలో సత్తా ఉంటుందో వాళ్ళే లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటారు. మరి ఆశిష్ తొలి అడుగు ఎంత గట్టిగా పడుతుందో చూడాలి.

Leave a Comment