న్యూస్ రివ్యూ

దృశ్యం 2 టాక్ ఏంటి….మీ అంచనాలను మించే సినిమా!!

కేవలం నెలన్నర టైం లో పూర్తీ అయిన సినిమా దృశ్యం 2, మొదటి పార్ట్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడే తిరిగి మొదలు అవుతుంది, సహజంగా సీక్వెల్ మూవీస్ అంటే మొదటి పార్ట్ విజయాన్ని క్యాష్ చేసుకోవాలని చేసే ప్రయత్నాలుగా ఎక్కువ సినిమాలు మిగిలి పోతాయి. దృశ్యం 2 సినిమా కూడా మొదలు అయినప్పుడు అలానే అనిపిస్తుంది… మొదటి పార్ట్ విజయాన్ని క్యాష్ చేసుకోవడానికి సినిమా తీసారేమో…

మంచి రేటు వచ్చింది కదా అని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు అనిపించిన సినిమా ఫస్టాఫ్ వరకు కూడా పెద్దగా ఇంప్రెస్ చేయదు, సెకెండ్ ఆఫ్ లో సగం కూడా పడుతూ లేస్తూ సాగిన సినిమా ప్రీ క్లైమాక్స్ నుండి అందరి అంచనాలను తలకిందలు చేస్తూ…

మొదట బోర్ అనిపించినా అంశాలు అన్నీ ఇంటర్ లింక్ చేస్తూ క్లైమాక్స్ అంచనాలను మించి ట్విస్ట్ తో ఇదీ సీక్వెల్ అంటే అనిపించే లెవల్ లో ముగుస్తుంది. అప్పటి వరకు ఉన్న ఇంప్రెషన్ ని కంప్లీట్ గా చేంజ్ చేసి ఏం సినిమా రా బాబు అనిపించేలా ముగుస్తుంది సినిమా…

మోహన్ లాల్ తన పాత్రలో అద్బుతంగా ఎలాంటి వంక పెట్టకుండా నటించి మెప్పించగా మీనా రోల్ కూడా మెప్పిస్తుంది, మిగిలిన రోల్స్ అన్నీ ఆకట్టుకోగా మోహన్ లాల్ రోల్ పార్ట్ 1 లో ఎలా దుమ్ము లేపుతుందో ఇందులో కూడా రచ్చ రచ్చ చేస్తుంది. ఆ పాత్రలో అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటున్నాడు అని మొదటి నుండి డౌట్ కొట్టగా సెకెండ్ ఆఫ్ నిజం బయట పడ్డాక…

హీరో దొరికిపోయాడు, ఇక ఏం చేస్తాడు అన్న డౌట్ లో ఉన్న టైం లో క్లైమాక్స్ ట్విస్ట్ తో అదరగొట్టేశారు. మొత్తం మీద సినిమా ఇండియా లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ లో ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. ఇక మొదటి పార్ట్ రీమేక్ చేసిన అందరు హీరోలు రెండో పార్ట్ రీమేక్ కి సిద్ధం అవ్వొచ్చు…

Leave a Comment