గాసిప్స్ న్యూస్

దెబ్బ పడింది సామి….నితిన్ మాస్ట్రో ప్రయాణం ఎటు వైపు ఇప్పుడు!

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఇప్పుడు వరుస ఫ్లాఫ్స్ ల ఎఫెక్ట్ వలన ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. భీష్మ సినిమా తో సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నా కానీ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన చెక్ మరియు రంగ్ దే సినిమాలు రెండూ కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైం లో నితిన్ తన ఆశలు అన్నీ కూడా అప్ కమింగ్ మూవీ అయిన…..

మేస్ట్రో మీదే పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అంధ ధూన్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నభా నటేష్, నెగటివ్ రోల్ లో తమన్నాలు నటిస్తుండగా ఈ సినిమా జూన్ నెలలో ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ…

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా సినిమా కి డిజిటల్ రిలీజ్ రేటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు 34 కోట్ల రేటు ఇవ్వగా ఆల్ మోస్ట్ డిజిటల్ రిలీజ్ కన్ఫాం అనుకోగా సడెన్ గా తెలంగాణలో కొత్త సినిమాలు ఏవి అక్టోబర్ వరకు డిజిటల్ రిలీజ్…

చేయొద్దు అంటూ కండీషన్ పెట్టడం తో ఇప్పుడు ఎం చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. నితిన్ రీసెంట్ మూవీస్ భీష్మ కి 21.8 కోట్ల బిజినెస్, చెక్ కి 16 కోట్ల బిజినెస్, రంగ్ దే కి 23.9 కోట్ల బిజినెస్ జరగగా ఈ సినిమా ఎక్స్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అవ్వడం నితిన్ కి బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడటంతో 18 కోట్ల రేంజ్ బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి.

అందుకే ఆ ఆఫర్ తో పోల్చితే డిజిటల్ రిలీజ్ రేటు సాలిడ్ గా దక్కడం తో డిజిటల్ రిలీజ్ కన్ఫాం చేసుకున్నా ఇప్పుడు కొత్త రూల్ వలన సినిమా డిజిటల్ రిలీజ్ ను కాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందట… దాంతో ఎటు వెళ్ళాలో అన్న డైలమాలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఎదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమాచారం…

Leave a Comment