న్యూస్ బాక్స్ ఆఫీస్

దెబ్బ మీద దెబ్బ..రంగ్ దే 10 డేస్ కలెక్షన్స్…ఎట్ లీస్ట్ యావరేజ్ అవ్వాలన్నా ఇంకా ఎంత కావాలంటే?

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే… లాస్ట్ ఇయర్ కి ముందు వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పుడు భీష్మ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వగా తర్వాత చెక్ సినిమాతో నిరాశ పరిచిన నితిన్ ఇప్పుడు రంగ్ దే సినిమాతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా రావడం లేదు. సినిమా మొదటి వారం తర్వాత సెకెండ్ వీక్ లో చాలా థియేటర్స్ ని కోల్పోగా…

అప్పటికీ బ్రేక్ ఈవెన్ కి చాలా కలెక్షన్స్ ఇంకా సాధించాల్సిన అవసరం ఉండగా సినిమా సెకెండ్ వీకెండ్ లో ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయింది. కరోనా కేసుల ఎఫెక్ట్ తో అన్ని సినిమాలు కూడా అంతంతమాత్రమే పెర్ఫార్మ్ చేశాయి, ఈ సినిమా విషయం లో కూడా అదే జరిగింది.

సినిమాను మొత్తం మీద 10 వ రోజు కేవలం 18 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశామే లేదని కన్ఫాం అయింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 10 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 5.74Cr
👉Ceeded: 2.12Cr
👉UA: 1.75Cr
👉East: 1.06Cr
👉West: 65L
👉Guntur: 1.17Cr
👉Krishna: 73L
👉Nellore: 52L
AP-TG Total:- 13.74CR (22.33Cr~ Gross)
KA+ROI: 76L
OS –  1.80Cr ( Updated)
Total World wide : 16.30CR(28.38Cr~ Gross)
ఇదీ సినిమా 10 రోజుల కలెక్షన్స్ పరిస్థితి.. సినిమాను టోటల్ గా 23.9 కోట్ల రేటు కి అమ్మగా 24.5 కోట్ల…

టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 8.2 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఎట్ లీస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అనిపించుకోవాలి అనుకున్నా 75%-80% రికవరీ చేయాలి అంటే… మరో 2 కోట్లకు పైగా షేర్ ని ఇంకా అందుకుంటేనే యావరేజ్ అవుతుంది, ఈ వారంలో వకీల్ సాబ్ ఉంది కాబట్టి ఇక రంగ్ దే ఫ్లాఫ్ గానే పరుగును ముగించవచ్చు.

Leave a Comment