టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ధనుష్ కర్ణన్ టోటల్ కలెక్షన్స్: 28 కోట్ల టార్గెట్ కి వచ్చిందో ఎంతో తెలిస్తే షాకే!!

కోలివుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ కెరీర్ లో ఎప్పటికప్పుడు డిఫెరెంట్ జానర్ మూవీస్ ని ఎంచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ లను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని రీసెంట్ గా కర్ణన్ సినిమా తో సొంతం చేసుకున్నాడు ధనుష్… ఈ సినిమా 50% లిమిటేషన్ లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ధనుష్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 27 కోట్ల కి పైగా బిజినెస్ ను సాధించిన ఈ సినిమా 28 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా తమిళ్ లో 2 వారాల్లో 52 కోట్ల మేర గ్రాస్ ను తమిళ్ లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా…..

సినిమా 2 వారాల్లో 60 కోట్ల మార్క్ కి… చేరువగా వెళ్ళింది, ఇక తర్వాత పరిస్థితులు సెకెండ్ వేవ్ వల్ల మరింత తీవ్ర తరం అవ్వడం తో థియేటర్స్ ను మూసేశారు, దాంతో పరుగును త్వరగానే ముగించిన కర్ణన్ సినిమా మొత్తం మీద తమిళనాడు లో పరుగు కంప్లీట్ అయ్యే టైం కి…

53.8 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుందట. ఇక వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 62 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందట. సినిమా టోటల్ షేర్ లెక్కలు తమిళనాడు లో 28.5 కోట్ల మార్క్ ని వరల్డ్ వైడ్ గా 33 కోట్ల లోపు ఉంటుందని సమాచారం. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ 28 కోట్లకు మరో 5 కోట్ల వరకు అధికంగా కలెక్షన్స్ ను సాధించి…

పరుగును ముగించింది, అది కూడా సెకెండ్ వేవ్ పీక్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు తప్పితే మిగిలిన రోజు 50% లిమిటేషన్ లో ఇలాంటి కలెక్షన్స్ ని సాధించడం, అది కూడా కెరీర్ బెస్ట్ నంబర్స్ అవ్వడం లాంటివి నిజంగానే అద్బుతం అని చెప్పొచ్చు. నార్మల్ టైం లో అయ్యి ఉంటే ఈ కలెక్షన్స్ మరింత భారీగా ఉండేవి…

Leave a Comment