న్యూస్ రివ్యూ

ధనుష్ కర్ణన్ రివ్యూ…తెలుగులో ఏమవుతుందో ఇక!

కోలివుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో హిట్ అయిన సినిమాల్లో ఒకటి ధనుష్ నటించిన కర్ణన్ సినిమా. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవ్వగా ఇతర భాషల వాళ్ళు కూడా సినిమాను చూశారు, ఇక తెలుగు లో రీమేక్ కాబోతున్న సినిమా కథ విశేషాలు ఏంటి అనేది గమనిస్తే…

1997 టైం లో తక్కువ కులం మీద అనేక వివక్షలు ఎదురుకుంటున్న ఆ ఊరిలో బస్సులు కూడా తిరగని పరిస్థితిలో తన చెల్లిని కోల్పోతాడు హీరో… పెరిగి పెద్దయ్యాక కూడా ఊరి పరిస్థితులు అలానే ఉండగా కులం పై అప్పుడప్పుడు గొడవలు పెద్దవి అవుతూ ఉండగా…

అనుకోకుండా ఒక గొడవలో బస్సు అద్దాలను పగలగొట్టి ఆ బస్సుని ద్వంసం చేస్తారు. తర్వాత పోలీసులు ఎంటర్ అవ్వడంతో పరిస్థితులు ఎలా టర్న్ తీసుకున్నాయి అన్నది కథ. ఓవరాల్ గా కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ పెర్ఫార్మెన్స్ ను అదిరిపోవడం కొన్ని సీన్స్ అద్బుతంగా తెరకేక్కడం లాంటివి సినిమా కి మేజర్ హైలెట్స్ గా నిలిచాయి.

తమిళనాడులో ఇంతకుముందు రియల్ గా జరిగిన స్టొరీ నే సినిమాగా తీశారు అంటున్నారు… సెకెండ్ ఆఫ్ సగం నుండి సినిమా కి ఆయువు పట్టు అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ కథ సెట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టడం కథనం స్లోగా ఉండటం లాంటివి బోర్ కొట్టినా ఇంటర్వెల్ నుండి సినిమా లెవల్ పెరిగి పోయి సెకెండ్ ఆఫ్ అంచనాలు పెరిగి… అక్కడక్కడా ట్రాక్ తప్పుతుంది అనిపించినా…

పోలిస్ స్టేషన్ సీన్, తర్వాత ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్ సన్నివేశాలు అన్నీ బాగుండటం తో సినిమా ఒక బాగా మెప్పిస్తుంది. ధనుష్ నటన మరో అవార్డ్ విన్నింగ్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు. తెలుగు నేటివిటీకి ఎంతవరకు సెట్ అవుతుంది, బెల్లంకొండ శ్రీనివాస్ ధనుష్ రోల్ కి ఎంతవరకు న్యాయం చేస్తాడు అన్నది చూడాలి ఇక…

Leave a Comment