న్యూస్ స్పెషల్

ధనుష్ లోకల్ బాయ్ కి సాలిడ్..షాకింగ్ TRP రేటింగ్!!

లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన కొత్త పాత చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమా లకు మంచి TRP రేటింగ్ లు దక్కుతున్నాయి. ఇక ఇందులో డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు, రఘువరున్ బి టెక్ సినిమా తో తెలుగు లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ధనుష్ తర్వాత అడపా దడపా తన సినిమా లను తెలుగు లో డబ్ చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా లాక్ డౌన్ కన్నా ముందు సైలెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ తమిళ్ మూవీ పటాస్ అక్కడ యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు లో ఈ సినిమా ను సైలెంట్ గా పెద్ద గా ప్రమోషన్ లేకుండా నే లోకల్ బాయ్ పేరు తో డబ్ అయింది.

ధనుష్, మేహ్రీన్ మరియు స్నేహ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు లో వీకెండ్ కి మించి ఆడలేదు, కానీ సినిమా కి ఓవరాల్ టాక్ మాత్రం పర్వాలేదు అనిపించే విధంగా వచ్చింది, ఇక ఈ సినిమా రీసెంట్ గా తెలిజినల్ లో టెలికాస్ట్ చేశారు.

జెమినీ టీవీ లో పోయిన వారం టెలికాస్ట్ అయిన ఈ సినిమా మొదటి సారి అయినా డీసెంట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఈ సినిమా కి 7.19 TRP రేటింగ్ దక్కింది, ఇది చాలా సినిమా ల కన్నా బెటర్ TRP రేటింగ్ అనే చెప్పాలి. ఎలాంటి ప్రమోషన్స్ లేకున్నా కానీ…

ఈ సినిమా కి మంచి TRP రేటింగ్ దక్కిందనే చెప్పాలి. లాక్ డౌన్ వలన అన్ని సినిమా లకు TRP రేటింగ్ పరంగా మంచి బూస్టప్ లభిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమా కి కూడా అది కలిసి వచ్చి మొత్తం మీద మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది…

Leave a Comment