న్యూస్ రివ్యూ

నయనతార “అమ్మోరు తల్లి” రివ్యూ….హిట్టా-ఫట్టా!!

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ స్పెషలిస్ట్ లలో ఒకరైన లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్య బిగ్ మూవీస్ లో హీరోయిన్ గాను అలాగే స్కోప్ ఉన్న ప్రతీ సారి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. నయనతార నటించిన లేటెస్ట్ మూవీ అమ్మోరు తల్లి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా దీపావళి కానుకగా సొంతం చేసుకుని రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది అన్నది తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే….ముగ్గురు చెల్లెళ్ళ భాద్యత, అమాయకపు అమ్మ భాద్యత టోటల్ ఇంటి భాద్యతను మోసే హీరో ఒక రిపోర్టర్ గా కనిచేస్తూ ఉంటాడు, తన భాద్యతలు చూసి తనకి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. దాంతో పెళ్లి మర్చిపోయి ఊరిలో ఉన్న…

11 వేల ఎకరాలను దోచుకోవాలని చూసే దొంగ బాబా పని పట్టాలని ట్రై చేసినా ఎవ్వరూ పట్టించుకోరు, ఇలాంటి టైం లో ఇల్లు బాగుండాలని తిరుపతికి వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరో తల్లి ఊర్వశి కోరిక నెరవేరదు, దాంతో హీరో కుటుంబం తాము మర్చిపోయిన తమ కుల దైవం…

ముక్కు పుడక అమ్మవారిని దర్శించుకోవడానికి వెళతారు, తర్వాత అమ్మవారు హీరో కి ప్రత్యక్షం అవుతారు, తర్వాత ఎం జరిగింది, పిలవడమే తడవుగా అమ్మవారు హీరో కి ఎందుకోసం ప్రత్యక్షం అయ్యారు లాంటి ఆసక్తి కరమైన విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా ముందు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి చెప్పుకుంటే…

అమ్మవారి లుక్ లో నయనతార దిగిపోయారు, భారీ తనం, లుక్స్ అన్నీ కూడా 100% సెట్ అయ్యాయి, సింపుల్ గా తన పాత్రలో నటించి మెప్పించారు నయనతార, ఇక హీరో కం డైరెక్టర్ అయిన ఆర్.జే.బాలాజీ మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో బాగానే నటించి మెప్పించాడు, తన డైరెక్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం…

ఇక హీరోకి అమ్మగా ఊర్వశి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే, అమాయకపు అమ్మగా, ఆకాతాయి తనంతో ఆమె నటన ఎంత నవ్విస్తుందో సెకెండ్ ఆఫ్ లో ఒక సీన్ లో ఆమె నటన కళ్ళలో నీళ్ళు తిరిగేలా కూడా చేస్తుంది, దొంగ బాబాగా నటించిన అజయ్ ఘోష్ కూడా…

సెకెండ్ ఆఫ్ లో బాగా నటించారు, ఇక ఇతర పాత్రలు చేసిన చెల్లెళ్ళు మరియు ఇతర నటీనటులు ఉన్నంతలో బాగానే మెప్పించారు, ఇక సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది అనిపిస్తుంది, డైలాగ్స్ తెలుగు లో బాగానే సెట్ అవ్వగా…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగా సెట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ గాడి తప్పింది, సినిమాటోగ్రఫీ బాగా మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ పరంగా హీరో కం డైరెక్టర్ ఆర్ జే బాలాజీ ఎన్.జె శరవణన్ తో కలిసి డైరెక్ట్ చేయగా…

ఫస్టాఫ్ వరకు బాగా ఎంటర్ టైన్ చేశారు, దొంగ బాబా ల పై పోరాటానికి దేవుడు దిగి రావడం, మనం ఆల్ రెడీ ఇంతకుముందే చూసేశాం, కానీ ఇక్కడ కొంచం ఎంచుకున్న పాయింట్ కొంచం డిఫెరెంట్ గా మొదలు అయ్యి మళ్ళీ రొటీన్ కి వచ్చేస్తుంది… సెకెండ్ ఆఫ్ లో నరేషన్ కంప్లీట్ గా ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది..

అక్కడక్కడా కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా ఫస్టాఫ్ రేంజ్ లో అయితే ఎంటర్ టైన్ చేయలేదు, బాబా తన కి హీరో యాంటీ అని తెలిసినా కావాలని కథ డిమాండ్ చేసిందని లైఫ్ షో కి వెళ్ళడం ఆబాసు పాలు అవ్వడం లాంటి సీన్స్ ఫోర్స్ గా అనిపించాయి, అలాగే హీరో ఫాథర్ ఇల్లు విడిచి…

అన్ని ఏళ్ళు ఎందుకు పారిపోయాడు, స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనేది చెప్పారు, సింపుల్ రీజన్ తో ముగిస్తారు, ఇలాంటి కొన్ని లాజిక్ లు సెకెండ్ ఆఫ్ లో చాలానే మిస్ చేసుకున్నా కానీ ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను చూడటం మొదలు పెడతాం కాబట్టి…

సినిమా ఫస్టాఫ్ ఇచ్చిన ఎంటర్ టైన్ మెంట్ తో సెకెండ్ ఆఫ్ కొంచం బోర్ కొట్టినా కానీ చూసేసి పర్వాలేదు బాగుంది అనుకుంటాం, మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో సినిమా బాగానే ఎంటర్ టైన్ చేస్తూ సమాజంలో దొంగబాబా ల గురించి మరోసారి అందరికీ హెచ్చరించేలా చేస్తుంది. సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

Leave a Comment