న్యూస్ బాక్స్ ఆఫీస్

నర్తనశాల అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎన్ని టికెట్లు సేల్ అయ్యయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టిన ఆపేసిన సినిమా నర్తనశాల 2004 లో భారీ స్టార్ కాస్ట్ తో మొదలు పెట్టినప్పటికీ సౌందర్య గారి మరణం వలన మధ్యలోనే ఆగిపోగా అప్పటి వరకు షూట్ చేసిన ఫూటేజ్ ని 16 ఏళ్ల తర్వాత రీసెంట్ గా పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేసి వచ్చిన డబ్బు తో సేవా పనులను చేయాల నీ డిసైడ్ అయ్యాడు బాలయ్య…

ఇదే విషయాన్నీ తెలియజేయగా సినిమా ఫూటేజ్ ఉన్నది తక్కువే అయినా కానీ ఈ మినీ దృశ్యకావ్యం ను చూడటానికి ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ బాగానే అడ్వాన్స్ బుకింగ్స్ ని ఈ మినీ మూవీ కోసం ఖర్చు చేశారు. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్….

సినిమా రిలీజ్ రోజు వరకు టోటల్ గా సేల్ అయిన టికెట్ కౌంట్ ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుండగా ఈ లెక్క ప్రకారం ఓవరాల్ గా సినిమా అడ్వాన్స్ టికెట్ సేల్స్ 1 లక్షా 58 వేల దాకా జరిగిందని సమాచారం. ఇది నిజంగానే అల్టిమేట్ రెస్పాన్స్ అని చెప్పాలి ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు…

ఈ మొత్తం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా సినిమా ఫూటేజ్ జనరేట్ చేసిన రెవెన్యూ ని ఒకసారి ఒక్క టికెట్ వాల్యూ 50 తో లెక్కేసి చూస్తె టోటల్ కౌంట్ 79 లక్షల దాకా వెళుతుందని చెప్పొచ్చు. అఫీషియల్ లెక్కలు ఇంకా రిలీజ్ అవ్వాల్సింది, అలాగే మొదటి రోజు సినిమా సాధించిన అఫీషియల్ వ్యూస్ లెక్కలు కూడా ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా…

ట్రేడ్ లో వినిపిస్తున్న ఈ లెక్కల ప్రకారం ఇది నిజం అయితే కచ్చితంగా సినిమా కి ఎపిక్ స్టార్ట్ లభించింది అని చెప్పాలి. ఈ వచ్చిన డబ్బు మొత్తం సేవా పనులను ఉపయోగించబోతున్నాని చెప్పిన బాలయ్య ఈ అడ్వాన్స్ టికెట్ సేల్స్ లెక్కలు చూసి సంతోషంగా ఉన్నారని అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment