న్యూస్ బాక్స్ ఆఫీస్

నర్తనశాల ఫస్ట్ డే కలెక్షన్స్….9750000 మెంటల్ మాస్ ఇది!!

నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టి మధ్య లో ఆపేసిన సినిమా నర్తనశాల 2004 లో ప్రారంభం అయ్యి 17 నిమిషాల లెంత్ ఉన్న షూటింగ్ ని కూడా పూర్తీ చేసుకున్నా కానీ అనుకోకుండా సౌందర్య గారి మరణం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది, అలాంటి సినిమా రీసెంట్ గా మంచి పని కోసం పే పెర్ వ్యూ పద్దతిలో బాలయ్య రిలీజ్ చేసిన విషయం అందరి కీ తెలిసిందే.

17 నిమిషాల లోపు ఫూటేజ్ అయినా కానీ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న ఈ మినీ మూవీ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా సాలిడ్ గానే దక్కుతుందని చెప్పాలి. సినిమా కి అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా మొదటి రోజు కన్నా ముందే ఓవరాల్ గా…

1 లక్షా 58 వేల దాకా టికెట్ సేల్స్ జరిగినట్లు ట్రేడ్ లో టాక్ వినిపించగా తర్వాత మొదటి రోజు కి గాను లెక్కలు కూడా ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా కి మొదటి రోజు దక్కిన యూనిక్ వ్యూస్ కూడా సాలిడ్ గా దక్కాయని అంటున్నారు. మొత్తం మీద మొదటి రోజు నర్తనశాల…

మినీ మూవీ కి సుమారు 1 లక్షా 95 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం… అంటే ఒక్క టికెట్ 50 తో 1 లక్షా 95 వేల లెక్కను గుణిస్తే…. మొత్తం మీద సినిమా కి మొదటి రోజు 97 లక్షల 50 వేల దాకా గ్రాస్ కలెక్షన్స్ దక్కి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇది నిజంగానే సెన్సేషనల్ ఓపెనింగ్ కలెక్షన్స్ గా భావించవచ్చు అంటున్నారు.

మినీ మూవీ అవ్వడం తో ఈ రేంజ్ లో ట్రెండ్ ని కొనసాగించడం విశేషం అనే అంటున్నారు. ఇక మొదటి వీకెండ్ లెక్కలు రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా ద్వారా బాలయ్య సేవా పనులకు వాడాలి అనుకుంటున్న మొత్తం ఇప్పుడు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువే వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment