న్యూస్ బాక్స్ ఆఫీస్

నాంది, చక్ర, కపటధారి అండ్ పొగరు ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్!

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ తర్వాత ఒకే రోజు నోటబుల్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అయింది ఫిబ్రవరి 19 నే.. ఏకంగా 4 మూవీస్ బాక్స్ ఆఫీస్ బరిలో పోటి పడగా అందులో 2 తెలుగు మూవీస్ అలాగే 2 డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి వేటికవే డిఫెరెంట్ జానర్ లో రూపొందగా అన్ని సినిమాల మొదటి రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారింది. ఒకసారి ఆ డీటైల్స్ ను గమనిస్తే…

అన్ని సినిమాలలోకి అల్లరి నరేష్ నాంది యునానిమస్ టాక్ ని సొంతం చేసుకుంది, కానీ అల్లరి నరేష్ ఓల్డ్ మూవీస్ రిజల్ట్ ఎఫెక్ట్ వలన ఓపెనింగ్స్ అంతంత మాత్రమే ఉండగా ఈవినింగ్ షోలకు హైదరాబాదులో కొన్ని ఇతర చోట్ల వర్షాలు ఇబ్బందిగా మారాయి. అయినా కానీ సినిమా ఉన్నంతలో ఇప్పుడు 50 లక్షల రేంజ్ లో..

ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అంతకుమించి కలెక్ట్ చేయాలని కోరుకుందాం, ఇక డబ్బింగ్ మూవీ విశాల్ చక్ర మిగిలిన సినిమాల్లోకి బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, మార్నింగ్ షోలకు పొగరు లీడ్ తీసుకున్న తర్వాత చక్ర లీడ్ తీసుకుంది. కానీ ఈ సినిమాకి కూడా వర్షాల దెబ్బ పడగా…

సినిమా మొదటి రోజు 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. ఇక పొగరు సినిమా కి మాస్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంతకు మించి కలెక్ట్ చేస్తే సినిమా సూపర్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకున్నట్లు అంచనా వేయవచ్చు.

ఇక అన్ని సినిమాల లోకి లోవేస్ట్ ఓపెనింగ్స్ కపటధారి సొంతం చేసుకుంది, టాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ సుమంత్ పూర్ ఫాం ఎఫెక్ట్ వలన చాలా లో ఓపెనింగ్స్ దక్కాయి. ఫస్ట్ డే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోవచ్చు. అన్ని సినిమాలు అంచనాలను మించి వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నాం… మరి అందుకుంటాయో లేదో చూడాలి ఇక…

Leave a Comment