న్యూస్ బాక్స్ ఆఫీస్

నాంది, చక్ర, కపటధారి, పొగరు డే 2 కలెక్షన్స్ అప్ డేట్…!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 19 న రిలీజ్ అయిన నాలుగు సినిమాలు అన్ని కూడా వేటి రేంజ్ లో అవి మంచి కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకోగా అన్ని సినిమాల లోకి ఒక్క కపటధారి సినిమా మాత్రం మొదటి రోజు దిమ్మతిరిగేలా అతి తక్కువ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు అన్ని సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేశాయి అన్నది ఆసక్తిగా మారగా..

ముందుగా నాంది సినిమా విషయానికి వస్తే సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపింది, మొదటి రోజు టాక్ ఇప్పుడు రెండో రోజు హెల్ప్ అవ్వగా సినిమా రెండో రోజు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే…

ఔట్ రైట్ ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక చక్ర సినిమా రెండో రోజు కూడా డీసెంట్ హోల్డ్ ని సాధించినా కానీ మొదటి రోజుతో పోల్చితే 40% రేంజ్ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డే 2 న 60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు…

ఇక పొగరు సినిమా రెండో రోజు కూడా మాస్ సెంటర్స్ లో మంచి ప్రదర్శననే కనబరిచినా కానీ మొత్తం మీద సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని రెండో రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక కపటధారి సినిమా విషయానికి వస్తే రెండో రోజు కూడా సినిమా పెద్దగా గ్రోత్ ని ఏమి సొంతం చేసుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డే 2 15 లక్షల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకునే అవకాశం ఉంది, సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశనే మిగిలించింది. మొత్తం మీద 4 సినిమాలు అంచనాలను మించి రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం….

Leave a Comment