న్యూస్ రివ్యూ

“నాంది” టీసర్ రివ్యూ….అల్లరి నరేష్ గట్స్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే!!

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో అల్లరి నరేష్. ఏడాదికి 4 కి తగ్గకుండా సినిమా లు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరోగా దూసుకు పోతున్న టైం లో కొద్దిగా స్లో అయినా తిరిగి 2012 లో చేసిన సుడిగాడు సినిమా తో కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేసిన అల్లరి నరేష్ తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవ్వడం… కామెడీ సినిమా లు చేసే వారు తగ్గడం…

లాంటివి ఎఫెక్ట్ అయ్యి అల్లరి నరేష్ మార్కెట్ పూర్తిగా పడిపోగా… ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకప్పటిలా జోరు చూపలేక పోతున్న అల్లరి నరేష్ తన పంథా మార్చి కంటెంట్ ఉన్న సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు, అందులో ముందుగా నేడు నాంది అనే సినిమా టీసర్ రిలీజ్ అయ్యింది.

దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 2015 నాటికి 1401 జైళ్లు ఉంటే 366781 మంది ఖైదీలు రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో దాదాపుగా 250000 మంది తప్పు చేశామో చేయలేదో తెలియకుండానే అండర్ ట్రయిల్ కింద శిక్ష అనుభవిస్తున్నారు” అంటూ స్టార్ట్ అయిన టీసర్ ఆద్యంతం కొత్తదనం చూపించిందని చెప్పాలి. సీన్ కోసం ఏకంగా న్యూడ్ గా నటించిన…

అల్లరి నరేష్ గట్స్ కి హాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. చేయని తప్పుకు గాను జైలు కి వచ్చిన వ్యక్తీ ఎలా తన నిజాయితీని నిరూపించుకుని బయటికి వచ్చాడు, దానికి ఎంత టైం పట్టింది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఆద్యంతం స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉంటుందని, కొత్తదనం కోరుకునే వారందకీ సినిమా కచ్చితంగా నచ్చుతని యూనిట్ చెబుతున్నారు.

ఇక అల్లరి నరేష్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన నాంది టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుందా లేదా పరిస్థితులు సద్దుకున్నాక థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే వాటి పై మరింత క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.

Leave a Comment