న్యూస్ రివ్యూ

నాంది మూవీ రివ్యూ….ఇది అల్లరి నరేష్ కంబ్యాక్ మూవీ!!

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరోడు అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ సుడిగాడు తర్వాత అలాంటి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన అల్లరోడు, ఇలా కాదు గమ్యం, శంభో శివ శంభో టైప్ లో డిఫెరెంట్ గా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ చేసిన సినిమా నాంది… మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ విషయానికి వస్తే… కుటుంబంతో హ్యాప్పీ గా గడిపే హీరో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే పనిలో ఉండగా అనుకోకుండా ప్రజల పక్షాన పోరాడే సీనియర్ లాయర్ హత్య జరుగుతుంది, కానీ ఆ కేసు కి ఏమాత్రం సంభందం లేని హీరో ని అరెస్ట్ చేస్తారు.

అసలు ఏ మాత్రం సంభందం లేని కేసులో ఇరుక్కున్న హీరో ఎలా బయటపడ్డాడు, తనని ఎవరు ఇరికించారు, తనకి లాయర్ వరలక్ష్మీ ఎలా హెల్ప్ చేసింది, అసలు దీని వెనక ఉన్నది ఎవరు లాంటి వివరాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా అల్లరి నరేష్ తన కెరీర్ లో…

వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా ఈ సినిమాలో నటించాడు. తను కామెడీ సినిమాలతో ఎలా నవ్వించగలడో, ఇలాంటి సీరియస్ మూవీస్ తో నటనతో కూడా కన్నీళ్లు తెప్పించగలను అన్నట్లు మెప్పించాడు. ప్రతీ సీన్ లో తన నటన బాగా మెప్పిస్తుంది. ఇక వరలక్ష్మీ పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఆకట్టుకుంటుంది… కొన్ని చోట్ల అద్బుతంగా నటించింది వరలక్ష్మీ. ఇక లైట్ కామెడీ తో…

ప్రియదర్శి మరియు ప్రవీణ్ లు మెప్పించిన మిగిలిన రోల్స్ చేసిన వారు అందరూ కూడా ఉన్నంతలో మెప్పిస్తారు. సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయే విధంగా ఉందని చెప్పాలి. చాలా సీన్స్ ని బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది అని చెప్పాలి.

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే… సినిమా ఓపెన్ అవ్వడం సీరియస్ గా ఓపెన్ అవ్వగా తర్వాత ఫ్లాష్ బ్యాక్ టచ్ ఉంటుంది, కొద్దిగా పడుతూ లేస్తూ కథ సాగినా ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యాక ఇక స్క్రీన్ ప్లే బాగా మెప్పిస్తుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ జనాలను ఆలోచించేలా చేస్తాయి.

సినిమాటోగ్రఫీ బాగా మెప్పించింది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించాయి. ఇక డైరెక్షన్ పరంగా విజయ్ కనకమేడల మొదటి సినిమా నే డిఫెరెంట్ జానర్ లో ఎంచుకుని ఆ పాత్ర కి అల్లరి నరేష్ ని ఎంచుకుని సర్ప్రైజ్ చేయగా డైరెక్టర్ నమ్మకాన్ని అల్లరి నరేష్ ఏమాత్రం వమ్ము చేయకుండా నిలబెట్టాడు.

మొత్తం మీద సినిమా అల్లరి నరేష్ నుండి వచ్చిన రీసెంట్ టైం బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ, కాన్సెప్ట్ డిఫెరెంట్ గా ఉండటం రీచ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్లకి ఎలా రీచ్ అవుతుంది లాంటివి ఇప్పుడే చెప్పలేం, కానీ అల్లరి నరేష్ హిట్ కొట్టాలి అని కోరుకునే వారి కోరిక నేరవేర్చేలా ఉంది..

డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారు, ఇలాంటి క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీస్ నచ్చే వాళ్ళు కచ్చితంగా ఈ సినిమా ను ఇష్టపడటం ఖాయం, రెగ్యులర్ మూవీస్ చూసేవాళ్ళు కూడా కొంచం ఓపిక తో చూస్తె సినిమా చాలా బాగా మెప్పిస్తుంది. సినిమా కి ఫైనల్ గా మా రేటింగ్ 3 స్టార్స్

Leave a Comment