న్యూస్

నాంది TRP: 2.3 కోట్ల రేటు…వచ్చిన TRP రేటింగ్ ఇది!!

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఇయర్ కి మినిమమ్ 3-4 సినిమాలు ఎప్పుడూ చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరోడు అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ హిట్ కొట్టి 9 ఏళ్ళు అవ్వగా ఎట్టకేలకు అల్లరోడు బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాడు సినిమా హిట్ తర్వాత మరో హిట్ ని లేటెస్ట్ గా నాంది సినిమాతో సొంతం చెసుకున్నాడు. కామెడీ సినిమాల వల్ల కానిది ఈ ప్రయోగాత్మక సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీత దాటి అల్లరోడికి కంబ్యాక్ మూవీ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 3 కోట్ల టార్గెట్ కి 5 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా చేసింది అని చెప్పాలి.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తక్కువ టైం కే డిజిటల్ రిలీజ్ ను కూడా సొంతం చేసుకుని అక్కడ కూడా సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకోగా సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. అల్లరి నరేష్ ప్రజెంట్ మార్కెట్ తగ్గినా కానీ…

ఈ సినిమా కి 2.3 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. ఇక సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా ఫస్ట్ టైం లోనే పెట్టిన రేటు మొత్తాన్ని రికవరీ చేసి టెలివిజన్ లో కూడా సూపర్ హిట్ అనిపించుకుందని చెప్పాలి. ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ లో జెమినీ టీవీ లో…

7.51 TRP రేటింగ్ సొంతం అయింది. ఇది కొన్ని పెద్ద సినిమాలకు సొంతం అయ్యే రేటింగ్ అని చెప్పాలి. ఒక సీరియస్ మూవీ కి టెలివిజన్ లో ఇంత మంచి రేటింగ్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. మొత్తం మీద అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై కూడా అల్లరోడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు.

Leave a Comment