గాసిప్స్ న్యూస్

నాకు 70 కోట్ల అప్పు ఉంది మీరిస్తారా??…సూర్య షాకింగ్ కామెంట్స్!!

ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ చేయడం కష్టం అన్న విషయం అందరి కీ తెలిసిందే, దాంతో వాళ్ళు గత రెండు నెలలుగా భారీ గానే లాస్ అవుతున్నారు, ఈ నేపధ్యం లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు కొన్ని లాక్ డౌన్ తర్వాత రిలీజ్ కాకుండా డైరెక్ట్ OTT లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండటం వాళ్ళకి మరింత కోపం తెప్పిస్తున్న విషయం అని చెప్పొచ్చు.

కాగా రీసెంట్ గా కోలివుడ్ స్టార్ హీరో సూర్య తీరు పై తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం తీవ్ర వ్యతిరేకతని చూపింది, డానికి కారణం సూర్య నిర్మాణం లో జ్యోతిక ముఖ్య భూమిక పోషించిన లేటెస్ట్ మూవీ పోన్ మగళ్ వందాళ్ అనే సినిమా సమ్మర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ…

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో డైరెక్ట్ OTT లో రిలీజ్ అవుతుంది, దాంతో సూర్య సినిమాలు థియేటర్స్ లో ఆడనివ్వకుండా బ్యాన్ చేస్తామని థియేటర్ ఓనర్లు మండి పడగా సూర్య కూడా అదే రేంజ్ లో రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు.. తన నిర్మాణం లో వచ్చిన సినిమాలు ఎలా బిజినెస్ చేసుకోవాలో…

తనకి తెలుసు అని, నిర్మాతలు ఎంతో కష్టపడి అప్పు తెచ్చిన డబ్బులతో సినిమాలు నిర్మిస్తామని, అవి బిజినెస్ చేసుకుని డబ్బులు సంపాదించుకోకుండా ఎం చేయాలని ప్రశ్నిస్తూ తన రీసెంట్ సినిమాల రిజల్ట్ వలన 70 కోట్ల మేర అప్పులు అయ్యాయని, ఆ నష్టం థియేటర్ ఓనర్లు ఇవ్వరు కదా… లాభం వస్తే మీరే ఉంచుకుంటారు కానీ మాకు ఎప్పుడైనా తిరిగి ఇచ్చారా…

అలాగే మాకు లాభం అనిపించే బిజినెస్ మేం చేసుకుంటాం ఇందులో తప్పేముంది అంటూ కౌంటర్ ఇచ్చారు, దాంతో కోలివుడ్ లో ప్రస్తుతం ఈ ఇష్యూ పై పెద్ద రచ్చే జరుగుతుందని సమాచారం, ఇక జ్యోతిక నటించిన పోన్ మగళ్ వందాళ్ త్వరలోనే డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోవడం మాత్రం పక్కా గా అవుతుందని సమాచారం….

Leave a Comment