గాసిప్స్ న్యూస్

నాని “అంటే సుందరానికీ” స్టొరీ పాయింట్ ఇదేనా??

ఎప్పటికప్పుడు విలక్షణ కథలను ఎంచుకుంటూ తన నాచురల్ యాక్టింగ్ తో సినిమాను మరో లెవల్ కి చేరేలా చేసే యాక్టర్ నాచురల్ స్టార్ నాని… టాలీవుడ్ లో వన్ ఆఫ్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా నిలిచిన నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో అన్నీ కూడా ఒకటికి మించి ఒకటి మంచి ఆసక్తిని రేపుతున్న విషయం తెలిసిందే, కానీ వాటిలో కూడా టైటిల్ తోనే భారీగా మెప్పించిన సినిమా రీసెంట్ గా అనౌన్స్ చేశారు…

అదే అంటే సుందరానికీ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే మంచి క్యూరియాసిటీ ని సొంతం చేసుకోగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ తర్వాత స్టొరీ లైన్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు నిజం అన్నది సినిమా రిలీజ్ టైం కే తెలుస్తుంది కానీ ఒకసారి ఆ కథ పాయింట్ ని గమనిస్తే నాని ఇందులో ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి. సంప్రదాయాలు, కట్టుబాట్ల విషయంలో పక్కాగా ఉంటాడు.

కానీ అమ్మాయిలతో మాట్లాడటం లాంటివి చాలా ఇబ్బందిగా చేసే ఈ క్యారక్టర్ ని అందరూ కొంచం తేడాగా అనుకుంటారట, కానీ సడెన్ గా ఓ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఇంట్లో మాత్రం తను ప్రేమించింది బ్రాహ్మణ అమ్మాయినే అని చెబుతాడు. ఇటు తన క్యారక్టర్ అటు తన ప్రేమించిన అమ్మాయి గురించి…

ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేసే కన్ఫ్యూజన్ కామెడీ తో ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసే సినిమా ఇదని అంటున్నారు… కథ పాయింట్ ఇది వరకు విన్నట్లుగానే ఉన్నా నాచురల్ స్టార్ యాక్టింగ్ తో సినిమా కి మరో లెవల్ హైప్ దక్కే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఈ కథ నిజమో కాదో కూడా రిలీజ్ టైం కే తెలుస్తుందని చెప్పొచ్చు.

Leave a Comment