న్యూస్ రివ్యూ వీడియో

నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

నాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ ఇప్పటికే జెర్సీ తో కంబ్యాక్ చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు, ఇక డైరెక్టర్ విక్రం కుమార్ మాత్రం తన కెరీర్ లో రీసెంట్ గా హలో సినిమా తో కమర్షియల్ ఫ్లాఫ్ తో ఉండగా వీరి కలయికలో గ్యాంగ్ లీడర్ అంటూ డిఫెరెంట్ రివేంజ్ డ్రామా తో సరికొత్త సినిమా ను సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కాగా రీసెంట్ గా సినిమా…

అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు, కాగా ట్రైలర్ చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పాలి. 28 రివేంజ్ కథలను అందించిన రైటర్ దగ్గరికి 5 గురు ఆడవాళ్ళు వచ్చి కొత్త కథ అడుగుతారు, హీరో కథ రాస్తుండగా అందులో రివేంజ్ సీన్స్ ని ఆడవాళ్ళు…

తమ లైఫ్ లో వాడుకుంటారు, ఇంతకీ ఆడవాళ్ళ కి ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన అన్యాయం ఏంటి, అది తెలుసుకున్న హీరో వాళ్ళ కి ఎలా హెల్ప్ చేశాడు అన్నది ఓవరాల్ కాన్సెప్ట్ గా ట్రైలర్ లో ఆల్ మోస్ట్ రివీల్ చేశారు. కాగా ట్రైలర్ కి హైలెట్స్ గా నాని కామిక్ టైమింగ్ అండ్ అనిరుద్ అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్ నిలిచాయి అని చెప్పొచ్చు.

RX100 ఫేం కార్తికేయ విలనిజం జస్ట్ అలా చూపెట్టి చూపెట్టనట్లు గ్లిమ్స్ వదిలారు, విక్రం కుమార్ టేకింగ్ అదిరి పోగా ఓవరాల్ గా ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే జెర్సీ లానే ఇది కూడా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అవ్వడం తో…

కమర్షియల్ గా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అన్నది చెప్పలేం, ట్రైలర్ లో అయితే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏవి లేవు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాక్ పాజిటివ్ గా ఉండి, కొంచం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటే నాని ఖాతాలో మరో సూపర్ హిట్ పడే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment