న్యూస్ రివ్యూ వీడియో

నాని మెంటల్ మాస్…. “వి” మూవీ టీసర్ రివ్యూ!

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “వి”.. తనని హీరోగా లాంచ్ చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తన ప్రతిష్టాత్మక 25 వ సినిమా ని అప్ప గించిన నాని ఏకంగా నెగటివ్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ని రిలీజ్ చేశారు.

టీసర్ చూస్తుంటే హిరో విలన్ ల మధ్య మైండ్ గేమ్ తో పాటు భారీ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తుంది, నాని నెగటివ్ రోల్ లో మెంటల్ మాస్ అనిపించే స్క్రీన్ ప్రజేన్స్ తో మెస్మరైజ్ చేశాడు, డైలాగ్స్, లుక్స్ యాటిట్యూడ్ అన్ని టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉన్నాయి.

ఇక సినిమాలో మరో ముఖ్య రోల్ చేస్తున్న సుదీర్ బాబు తన లుక్స్ అండ్ యాటిట్యూడ్ తో మెప్పించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, విజువల్స్ టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో ని తలపించే విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా టీసర్ లో పోలిస్ ఒక క్రైం చేసిన విలన్ ని పట్టుకునే పనిలో ఉంటాడు…

కానీ ఆ విలన్ క్రైం ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు విలన్ గా ఎందుకు మారాడు లాంటి సస్పెన్స్ అంశాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే, ఓవరాల్ గా టీసర్ నాని ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉండగా రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా… ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడబోతున్న ఫీలింగ్ ని కలిగించింది.

మొత్తం మీద టీసర్ కి ఇనీషియల్ ఇంప్రెషన్ మాత్రం సూపర్ పాజిటివ్ గా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఇదే రేంజ్ లో ఉంటె సమ్మర్ లో ఫస్ట్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పాలి. సినిమా మార్చి 25 న రిలీజ్ కాబోతుంది. మీరు టీసర్ చూసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

Leave a Comment