న్యూస్

నారప్పపై బెస్ట్ కామెంట్ ఇదే…చిరు-వెంకీల బాండింగ్ అదుర్స్!

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప రిలీజ్ అయినప్పటి నుండి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తూ డిజిటల్ లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రావాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా డిజిటల్ లో రిలీజ్ అయిన ఆడియన్స్ నుండి సినిమా కి…

సూపర్ రెస్పాన్స్ వస్తూ ఉంది, సినిమాను ఒరిజినల్ తో కంపేర్ చేసి కొందరు విమర్శలు కావాలని చేస్తున్నప్పటికీ విశ్లేషకులు మాత్రం సినిమా ఇంప్రెస్ చేయగా ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెంకటేష్ ని ఇది వరకు ఎప్పుడూ ఇలాంటి రోల్ లో చూడక పోవడం తో….

ఈ రోల్ లో వెంకటేష్ అదరగొట్టేశాడు అంటూ మెచ్చుకుంటూ ఉండగా అందరి కామెంట్స్ ఒకెత్తు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ మరో ఎత్తుగా మారింది ఇప్పుడు. ఈ సినిమా డిజిటల్ లో చూసిన వెంటనే మెగాస్టార్ వెంకటేష్ కి ఫోన్ చేసి ఓ రేంజ్ లో మెచ్చుకున్నారట.

అసలు ఏ సీన్ లో కూడా వెంకటేష్ కనిపించలేదని, సినిమా మొత్తం నారప్ప మాత్రమె కనిపించారని, నారప్ప రోల్ తోనే మనం ట్రావెల్ చేసేలా నువ్వు అద్బుతంగా నటించావ్ అంటూ మెచ్చుకున్నారట మెగాస్టార్. ఈ విషయాన్నీ స్వయంగా విక్టరీ వెంకటేష్ ఆడియో రికార్డ్ తో ఆడియన్స్ కి వినిపించడం జరిగింది. టాలీవుడ్ సీనియర్ హీరోల మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది అన్న విషయం ఈ సినిమా సందర్భంగా…

మరోసారి తేటతెల్లం అవ్వగా చిరు వెంకీల బాండింగ్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు ఇప్పుడు. ఇక సినిమా డిజిటల్ లో టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సినిమా డిజిటల్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అందరూ భావిస్తున్నారు.

Leave a Comment