న్యూస్ రివ్యూ

నారప్ప రివ్యూ…వెంకీ ఊరమాస్….కానీ ఇదేంటి!

విక్టరీ వెంకటేష్ నుండి సోలో హీరోగా సినిమా వచ్చి చాలా టైం అవుతుంది, వరుసగా మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా చేస్తూ వస్తుండటం తో సోలో హీరోగా వెంకీ నుండి ఒకప్పటి వింటేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సినిమా కోసం చాలా కాలంగా అభిమానులు సామాన్య ప్రేక్షకులు ఎదురు చూస్తున్న టైం లో నారప్ప సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ విషయానికి వస్తే వ్యవసాయం చేసుకుంటూ ఉండే హీరోకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు, పెద్ద కొడుకు కోపదారి… అనుకోకుండా జరిగిన ఒక ఇంసిడెంట్ లో ఊరి పెద్దని కొడతాడు. ఆ కోపంతో ఊరిపెద్ద పెద్ద కొడుకుని చంపిస్తాడు. ఆ విషయం తెలిసినా కానీ తండ్రి కోపగించుకోడు…

అది చూసి చిన్న కొడుకుకి కోపం వచ్చి ఆ ఊరిపెద్ద ని నరుకుతాడు… ఇక చిన్న కొడుకునైనా కాపాడుకుందామని హీరో ఏం చేశాడు, నారప్పని ఫ్యామిలీని అంతమొందించడానికి ఊరి పెద్ద కుటుంబం ఎలాంటి ప్లాన్స్ వేశారు. మరి నారప్ప కొడుకును కాపడుకున్నాడా లేదా…అసలు నారప్ప ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

రీమేక్ అంటే 2 రకాలుగా తీస్తారు… ఒకటి మక్కికి మక్కి సీన్ టు సీన్ దించేయడం మరోటి, ఒరిజినల్ కథని నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడం, రెండో కోవలోకి చాలా తక్కువ మంది మాత్రమె సక్సెస్ అయ్యారు. అందుకేనేమో నారప్ప ని యాసిటీస్ గా ఒరిజినల్ నుండి సీన్ టు సీన్ డైరెక్ట్ చేసి దింపేశారు. ఇది ఒరిజినల్ చూడని వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పెట్టదు కానీ…

ఆల్ రెడీ ఒరిజినల్ ని చూసి ఉన్న వాళ్ళకి ప్రతీ సీన్ లో ఒరిజినల్ గుర్తుకు వచ్చి ఆ సీన్ బాగుందా లేక ఈ సీన్ బాగుందా అనే కంపారిజన్లు మొదలు అవుతాయి. అలా చూసినప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది తప్పితే చాలా కొన్ని సార్లు మాత్రమే ఒరిజినల్ కన్నా బెటర్ అనిపిస్తుంది నారప్ప సినిమా… సో ఒరిజినల్ చూసిన వాళ్ళకి వెంకీ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ తప్ప మిగిలిన కథ మొత్తం యావరేజ్….

ఇక చూడని వాళ్ళ విషయానికి వస్తే… వెంకటేష్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ వింటేజ్ వెంకటేష్ ని తిరిగి గుర్తు చేయడం చాలా బాగా మెప్పించింది, ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టొరీ కొంచం ఇబ్బంది పెట్టింది, అలాగే కథ ఆ టైం ప్రకారం స్లోగా రన్ అవ్వడం అక్కడక్కడా కొంచం బోర్ అయ్యేలా చేస్తుంది కానీ ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ మెప్పుని కచ్చితంగా సొంతం చేసుకోవడం ఖాయం.

వెంకటేష్ చాలా కాలానికి వింటేజ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపగా, ప్రియమణి పెర్ఫార్మెన్స్, రావ్ రమేష్ రోల్, నాజర్ ల రోల్స్ కూడా మెప్పిస్తాయి. మిగిలిన యాక్టర్స్ కూడా మెప్పించాగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపించగా డైలాగ్స్ బాగున్నాయి. ఇక సంగీతం విషయంలో మణిశర్మ పాటలు బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఒరిజినల్ నే వాడారు కానీ అది ఇక్కడ కూడా సాలిడ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.

ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక డైరెక్షన్ పరంగా శ్రీకాంత్ అడ్డాల సీన్ టు సీన్ దించేసినా ఇప్పటి వరకు తను చేయని మాస్ ఎలిమెంట్స్ ని బాగానే హ్యాండిల్ చేశాడు అని చెప్పాలి. కొంచం ట్రిమ్ చేసి ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టొరీ ప్లేస్ లో ఇంకా ఏదైనా ఇంసిడెంట్ ని తీసుకుని తెరకెక్కించి ఉంటే ఇంకా బాగుండేది.. మొత్తం మీద నారప్ప సినిమా తో….

మరోసారి సమాజంలో ఇప్పటికీ ఎక్కువ కులం తక్కువ కులం మీద ఉండే వివక్ష లాంటివి మరోసారి బాగా చూపెట్టారు. ఓవరాల్ గా నారప్ప ఫ్యాన్స్ కి ఎలాగూ నచ్చుతుంది కానీ ఒరిజినల్ చూడని వాళ్లకి ఎక్స్ లెంట్ గా అనిపిస్తుంది. చూసిన వాళ్ళకి యావరేజ్ గా అనిపిస్తుంది… మీరు సినిమా చూసినట్లు అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి.

Leave a Comment