న్యూస్

నేషనల్ వైడ్ గా కొట్టుకున్న విజయ్-అజిత్ ఫ్యాన్స్…ఏంటో వీళ్ళు!!

సోషల్ మీడియా అన్నది భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగ పడే ఒక సాధనం, కానీ ఫ్యాన్స్ లో కొందరు తమ హీరోల మీద ప్రేమని ఇతర హీరోల మీద పగని చూపెట్ట డానికి వేదికగా మార్చుకుంటారు. టాలీవుడ్ లో ఇతర ఇండస్ట్రీలలో కూడా ఫ్యాన్ వార్స్ అనేవి కామన్ అనే విషయం అందరికీ తెలిసిందే, తెలుగులో స్టార్ హీరోలు ఎక్కువ కాబట్టి ఎప్పుడూ ఎదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది కానీ..

చాలా తక్కువ సమయాలలోనే మన హీరోల ఫ్యాన్స్ హద్దులను దాటి ఇతర హీరోల మీద ట్రోల్స్ నేషనల్ లెవల్ లో ట్రెండ్ చేయడం విషయంలో వేస్తూ ఉంటారు, కానీ కోలివుడ్ లో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరిగేవి కేవలం విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్ మధ్యే…

కానీ అవి ఎప్పుడో ఒకసారి లా కాకుండా ఎప్పుడూ ఎదో ఒక గొడవతో జరుగుతూనే ఉంటాయి, లేటెస్ట్ గా మళ్ళీ వీళ్ళ గొడవ నేషనల్ లెవల్ లో న్యూస్ అయింది, ఎవరు ముందు మొదలు పెట్టారో తెలియదు కానీ ఒకరి మీద ఒకరు నెగటివ్ కామెంట్స్ తో నేషనల్ లెవల్ లో….

టాప్ 5 ప్లేసులలో ట్రెండ్ చేస్తూ అజిత్ మీద విజయ్ ఫ్యాన్స్, విజయ్ మీద అజిత్ ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తూ ఒక్కొక్కరు రెండున్నర లక్షల రేంజ్ లో ట్వీట్స్ వేసి ట్రెండ్ చేస్తూ ఉండగా ఇతర ఇండస్ట్రీల ఫ్యాన్స్ వీళ్ళ గొడవ చూసి మనం కూడా ఇంతలా నెగటివ్ ట్రెండ్లు చేయం కదా అనుకుంటున్నారు ఇప్పుడు.

అడపాదడపా హీరోలు ఇద్దరూ కలిసినప్పుడు ఒకరు మరో హీరో ప్రస్తావన తెచ్చినప్పుడు కలిసి ఉన్నట్లే ఉండే ఫ్యాన్స్ ఎదో ఒక చిన్న గొడవతో ఇలా రచ్చ మరో లెవల్ లో చేస్తూ ఉంటారు. దాంతో మన దగ్గర అన్న ఫ్యాన్ వార్స్ తగ్గే అవకాశం ఉంది కానీ కోలివుడ్ ఫ్యాన్ వార్స్ తగ్గడం చాలా కష్టం అంటున్నారు ఇదంతా చూస్తున్నవాళ్ళు.

Leave a Comment