న్యూస్ బాక్స్ ఆఫీస్

పరాయి గడ్డపై పవర్ స్టార్…రాంపేజ్…కానీ థియేటర్స్ ని సీజ్ చేశారు…కారణం ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో అన్ని పరిస్థితులను ఎదురుకుని కూడా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం, ఇక సినిమా ఆడుతున్న థియేటర్స్ లో కొన్ని థియేటర్స్ ని రీసెంట్ గా పోలీసులు సీజ్ చేయడం జరిగింది, కానీ అది మన రాష్ట్రాలలో కాదు…

తెలుగు సినిమాలు విరివిగా చూసే ఇతర రాష్ట్రాలలో ఒడిశా రాష్ట్రంలో…..శ్రీకాకుళం సరిహద్దులో ఉండే పర్లాకిమిడి పట్టణం ఒడిశా రాష్ట్రం కిందే వస్తుంది…తెలుగు సినిమాలు చాలా విరివిగా అక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి, లోకల్ మూవీస్ తో పాటు మన సినిమాలను కూడా అక్కడ చూస్తారు.

అందులో భాగంగానే రీసెంట్ గా అక్కడ లోకల్ మూవీస్ తో పాటు వకీల్ సాబ్ ని కూడా వేయగా లోకల్ మూవీస్ కన్నా కూడా ఈ సినిమా ఆదరణ సాలిడ్ గా లభించడం మొదలు అయింది, అక్కడ థియేటర్ ఓనర్లు ఆశ పెరిగి పోయి ప్రభుత్వం పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేశారు.

అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతూ ఉండటం తో 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్స్ పెట్టారు, కానీ వకీల్ సాబ్ సినిమాను చూడటానికి జనాలు ఎక్కువ సంఖ్యలో రావడం తో థియేటర్ ఓనర్లు పవర్ స్టార్ క్రేజ్ చూసి ఎక్కువ షోలు ఎక్కువ ఆక్యుపెన్సీని పెట్టడం మొదలు పెట్టగా ఈ విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు తర్వాత ఇలా చేసిన థియేటర్స్ కొన్నింటినీ అక్కడ…

సీజ్ చేశారని సమాచారం. భారీ ఫైన్ కూడా వేశారట. ఆ ఫైన్ ని కట్టిన తర్వాతే థియేటర్స్ ని తిరిగి తెరచేలా చేశారట. తర్వాత 50% లిమిటేషన్స్ తోనే సినిమా అక్కడ ప్రదర్శితం అవుతుందని సమాచారం. అయినా కానీ జనాలు బాగానే సినిమాను ఆదరిస్తున్నారని తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా పవర్ స్టార్ కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Comment