న్యూస్ స్పోర్ట్స్

పరువు కోసం సౌత్ఆఫ్రికా…ఫస్ట్ విక్టరీ కోసం ఇండియా…హై ఒల్టేజ్ మ్యాచ్!!

వండే వరల్డ్ కప్ మొదలు అయ్యి ఆల్ మోస్ట్ వారం కావస్తున్నా ఇప్పటి వరకు ఇండియా మ్యాచ్ జరగక పోవడం తో ఎప్పుడెప్పుడు మ్యాచ్ మొదలు అవుతుందా అని అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా నేడు ఇండియా సౌత్ఆఫ్రికా ని ఎదురుకోబోతుంది.

కాగా ఓపెనర్స్ ఫాం కొద్దిగా ఇబ్బంది పెడుతున్నా మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ లైనప్ ఇండియా కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, మరో పక్క వరుసగా ప్లేయర్స్ ఇంజూర్ అవుతుండటం తో సౌత్ఆఫ్రికా ఇబ్బందుల్లో ఉండగా వరుసగా 2 మ్యాచులు ఓడిపోవడం భారీ ఎదురుదెబ్బ కొట్టింది.

దాంతో నేటి మ్యాచ్ లో ఇండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది అని చెప్పొచ్చు. కొద్దిగా వర్షం ఇబ్బంది పెట్టె అవకాశం ఉన్నా మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది, పరువు కోసం సౌత్ఆఫ్రికా…ఫస్ట్ విక్టరీ కోసం ఇండియా…హై ఒల్టేజ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Leave a Comment