గాసిప్స్ న్యూస్

పవన్ కళ్యాణ్ రానా మూవీ టైటిల్ ఇదేనా…రచ్చ రచ్చే ఇక!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. సాగర్ చంద్ర డైరెక్షన్ లో త్రివిక్రమ్ కథా మార్పులు చేసిన ఈ సినిమా పై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా టైం తర్వాత…

పోలిస్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సినిమా మేకింగ్ వీడియో ని షూటింగ్ లో పవన్ రానా లు పాల్గొన్న సీన్స్ ని రిలీజ్ చేయగా బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే సినిమా పై హైప్ ని….

ఓ రేంజ్ లో పెంచాడు తమన్, బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే ఏడాది సంక్రాంతి కి సిద్ధం అవుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు టైం లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ముందు సినిమాకి కొన్ని డిఫెరెంట్ టైటిల్స్ ను…

అనుకున్నారు కానీ మేకింగ్ వీడియో లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ను ఇంట్రో చేసినప్పటికీ నుండి ఆ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. భీమ్లా నాయక్ అంటూ పవన్ పేరు మీదే ఇప్పుడు టైటిల్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు. ఫ్యాన్స్ కూడా టైటిల్ కొత్తగా ఉండటం తో ఈ టైటిల్ నే…

కన్ఫాం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ ఒరిజినల్ వర్షన్ లో ఇద్దరు హీరోల పేరు మీద టైటిల్ ఉంటుంది. ఇక్కడా అలా ఉండాలని రూల్ ఏమి లేదు కానీ మేకర్స్ అలాంటి టైటిల్ కోసం ఇంకా వెతుకుతున్నారని, పవన్ పుట్టిన రోజు నాటికి అలాంటి టైటిల్ దొరకకుంటే కచ్చితంగా భీమ్లా నాయక్ టైటిల్ ఆల్ మోస్ట్ కన్ఫాం అని అంటున్నారు.

Leave a Comment