న్యూస్

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ TRP రిలీజ్ డేట్….ఎంత TRP రావొచ్చంటే…!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ కి కంబ్యాక్ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్, భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి ఒరిజినల్ లను కూడా మించి మెప్పించిన వకీల్ సాబ్ కి ఆంధ్రలో టికెట్ రేట్ల దెబ్బ తర్వాత సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన బాక్స్ ఆఫీస్ రన్ మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. అయినా కానీ ఉన్నన్ని రోజులు కుమ్మేసిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో…

రిలీజ్ ను సొంతం చేసుకుని అక్కడ కూడా కుమ్మేయగా సాలిడ్ రేటు ఆఫర్ చేసి జీ తెలుగు వాళ్ళు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుని రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేయగా, టెలికాస్ట్ చేసే టైం లో పోటిగా ఇతర ఛానెల్స్ లో కూడా రీసెంట్ టైం లో…

బెస్ట్ TRP రేటింగ్ లు సాధిస్తున్న సరిలేరు నీకెవ్వరు ఒక ఛానెల్ లో, మరో ఛానెల్ లో జాంబి రెడ్డి, ఇక చాలా టైం కి క్రికెట్ మ్యాచ్ లు ఇలా పోటికి చాలానే అడ్డంకిగా నిలిచినా ఈ మధ్య కాలంలో ఏ హీరో సినిమా కి జరగని విధంగా…

టెలివిజన్ ప్రీమియర్ కి కూడా ఓ రేంజ్ లో పబ్లిసిటీ వకీల్ సాబ్ కి లభించింది, దాంతో TRP రేటింగ్ లో దుమ్ము లేపడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. కానీ ఇతర ఛానెల్స్ లో పోటి కూడా ఉండటం తో మా అంచనా ప్రకారం 16-18 రేంజ్ లో సినిమా రేటింగ్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాం, ఇక అంతకుమించి సినిమా రేటింగ్ వస్తే…

అది ఊరమాస్ అనే చెప్పాలి… ఇక జీ తెలుగు లో హైయెస్ట్ శ్రీమంతుడు 22.54 ఉండటంతో ఈ రికార్డ్ ను వకీల్ సాబ్ అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా TRP రేటింగ్ ఈ నెల 29 న మధ్యాహ్నం 1 తర్వాత BARC వాళ్ళు రిలీజ్ చేస్తారు.. రిలీజ్ చేసిన తర్వాత ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం. అప్పటి వరకు ఎదురు చూడండి…

Leave a Comment