గాసిప్స్ న్యూస్

పవన్ కళ్యాణ్ 27 వ సినిమా…రెడీగా 3 టైటిల్స్ ఉన్నాయి!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి వరుసగా సినిమాలను కమిట్ అవుతున్న విషయం తెలిసిందే, ముందు పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా తో పాటు ఎవ్వరూ ఊహించని విధంగా క్రిష్ డైరెక్షన్ లో ఏకంగా పాన్ ఇండియా మూవీ ని కమిట్ అవ్వగా కొంత షూటింగ్ కూడా చేశారు. తర్వాత లాక్ డౌన్ వలన షూటింగ్స్ ఆగిపోయాయి.

కాగా ఇంకా షూటింగ్స్ కి తిరిగి వెళ్ళని పవర్ స్టార్ ముందుగా వకీల్ సాబ్ ని కంప్లీట్ చేయాలని భావిస్తుండగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న 27 వ సినిమా షూటింగ్ కూడా కొంత గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా ఈ సినిమా కి సంభందించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కి ఓవరాల్ గా మూడు టైటిల్స్ ని అనుకుంటున్నారని తెలుస్తుంది…. సినిమా కి వర్కింగ్ టైటిల్ గా “విరూపాక్ష” అని పెట్టారట… ఇక మూవీ టైటిల్స్ గా “బందిపోటు” మరియు “గజదొంగ” అని మరో 2 టైటిల్స్ ని అనుకుంటున్నారని సమాచారం.

కాగా ఈ మూడు టైటిల్స్ లో ఒక టైటిల్ ని త్వరలోనే కన్ఫాం చేసి కుదిరితే చిరు బర్త్ డే కి లేదా పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ తో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద 3 టైటిల్స్ లో పవర్ ఫుల్ టైటిల్స్ గా బందిపోటు మరియు గజదొంగ ఉన్నప్పటికీ…

యూనిక్ అండ్ డిఫెరెంట్ గా మాత్రం విరూపాక్ష టైటిల్ బాగుందని చెప్పాలి. మరి మొత్తం మీద మూడు టైటిల్స్ లో ఏ టైటిల్ కన్ఫాం అవుతుందో అన్నది త్వరలోనే తేలనుంది. త్వరలోనే సినిమా టైటిల్ పై ఎదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది…

Leave a Comment