న్యూస్

పవర్ స్టారా మజాకా….20 నెలల రికార్డ్…డబుల్ మార్జిన్ తో ఔట్!!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవర్ స్టార్ పేరిట సెన్సేషనల్ రికార్డ్ మరోటి తెచ్చి పెట్టారు. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా థీం సాంగ్ ని 7న రిలీజ్ చేయబోతుండగా సినిమా థీమ్ సాంగ్ గ్లిమ్స్ ప్రమో ను రీసెంట్ గా రిలీజ్ చేశారు, కాగా ఆ ప్రోమోకి వచ్చిన రెస్పాన్స్ మరో లెవల్ అనే చెప్పాలి…

24 గంటల్లో ఇలా రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోల పరంగా హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ను 20 నెలల క్రితం అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలోని సామజవరగమనా సాంగ్ ప్రోమో 24 గంటల్లో 209K లైక్స్ ని అందుకుని రికార్డ్ కొట్టగా ఆ రికార్డ్ ను 1 గంట గ్యాప్ లోనే బ్రేక్ చేసిన…

భీమ్లా నాయక్ థీమ్ సాంగ్ గ్లిమ్స్ ఓవరాల్ గా 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి 422.6K లైక్స్ ని అందుకుని డబుల్ మార్జిన్ తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రేంజ్ లో రచ్చ చేసిన ఈ థీమ్ సాంగ్ ఇక ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇక…

Leave a Comment