గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

పవర్ స్టార్ ఆగమనం…టాలీవుడ్ మొత్తం షాక్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ లైఫ్ ని మధ్యలో ఆపేసి రాజకీయ లైఫ్ లో బిజీ అయిన విషయం తెలిసిందే, అభిమానులకి తిరుగు లేని గిఫ్ట్ ఇవ్వాలని చేసిన ప్రతిష్టాత్మక 25 వ సినిమా టైటిల్ కార్డ్ వరకు మాత్రమె ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది, సినిమా పరంగా తీవ్ర నిరాశ పరిచిన ఆ సినిమా ను మరిపించే విధంగా మరొక్క సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకునే వారు కానీ పాలిటిక్స్ లో ఇక బిజీగా ఉంటానని…

లాస్ట్ ఇయర్ పవన్ చెప్పారు, ఇక సినిమాలు చేయనని ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు, కానీ పార్టీ ఓడిపోవడం తో ఇప్పుడు ఖాళీగానే ఉండటం వలన నిర్మాతలు అడగడం తో తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ముందుగా…

బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ రీమేక్ లో నటించబోతున్నారు. ఆ సినిమా తర్వాత కూడా రెండు మూడు మూవీస్ కమిట్ అవ్వడం తో టాలీవుడ్ మొత్తం షాక్ అవ్వగా ఇప్పుడు చేయబోతున్న రీమేక్ మూవీ కి గాను పవర్ రెమ్యునరేషన్ తెలిసి మరింత షాక్ అవుతున్నారు.

30 నుండి 40 రోజుల కాల్ షీట్ కి గాను ఏకంగా 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని పవర్ స్టార్ అందుకో బోతున్నారట. తక్కువ కాల్ షీట్స్ కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ మరే స్టార్ హీరో కూడా సొంతం చేసుకోలేదు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండబోతుందట.

ఆ సినిమా తో పాటు తనకి గబ్బర్ సింగ్ తో తిరుగు లేని కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కి మరో కథ చెప్పారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ సినిమా క్రిష్ సినిమా కన్నా ముందు లేక తర్వాత మొదలు అయ్యే అవకాశం ఉందని సమచారం. పవర్ స్టార్ ఆగమనంతో ఇప్పుడు తిరిగి బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

Leave a Comment