గాసిప్స్ న్యూస్

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే…హరీష్ శంకర్ సినిమా లో పవన్ రోల్ ఇదే!

కొన్ని కాంబినేషన్ లో సినిమాలు ఇన్ స్టంట్ గా మంచి హైప్ ని సొంతం చేసు కుంటాయి… అలాంటి కాంబినేషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ ల కాంబినేషన్ కూడా ఒకటని చెప్పాలి. 2010 లో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ దబంగ్ ని తెలుగు లో గబ్బర్ సింగ్ గా 2012 లో రీమేక్ చేసి ఒరిజినల్ కన్నా కూడా బెటర్ అవుట్ పుట్ ఇవ్వడమే కాకుండా…

అంత్యాక్షరి సీన్, కబడ్డీ సీన్, మార్కెట్ సీన్ లాంటి ఇంప్రూవ్ మెంట్స్ తో తన సత్తా చాటి పవర్ స్టార్ ని ఎవ్వరూ చూపెట్టని విధంగా చూపెట్టి మెప్పించాగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమా తర్వాత గబ్బర్ సింగ్ సీక్వెల్ లో తిరిగి…

హరీష్ శంకర్ ఉంటాడు అనుకుంటే… కొన్ని కారణాల వల్ల తప్పుకోగా మళ్ళీ ఇప్పుడు పవర్ స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ ని దక్కించు కున్నాడు హరీష్ శంకర్. ఈ సారి ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఆశగా ఎదురు చూస్తుండగా… ఈ సారి కూడా తమకి కలిసి వచ్చిన పోలిస్ స్టొరీ నే…

సినిమా కి మెయిన్ పాయింట్ గా ఎంచుకుని ఓ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమాను రూపొందించాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది. ఇది రీమేక్ కాదని గట్టిగా చెబుతున్నా కొన్ని లీక్స్ ప్రకారం సినిమా కొంచం తమిళ్ లో వచ్చిన తెరీ సినిమా స్టొరీ పాయింట్ కి దగ్గరగా ఉంటుందని లీక్ ఉంది.

మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ పవర్ స్టార్ కి కలిసి వచ్చిన పోలీస్ రోల్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ విత్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటున్నారు కాబట్టి కచ్చితంగా అవుట్ పుట్ బ్లాక్ బస్టర్ కి తక్కువ కాని రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని అంచనా వేయొచ్చు.

Leave a Comment