న్యూస్ బాక్స్ ఆఫీస్

పాజిటివ్ టాక్ పవర్…4 వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ ఇది!!

తెలుగు ఆడియన్స్ చాలా టైం నుండి మంచి ఎంటర్ టైనర్ కోసం ఎదురు చూస్తున్నారు… జాతిరత్నాలు ఆ కోవలో అంచనాలను మించి సంచలనం సృష్టించగా తర్వాత మళ్ళీ పెద్దగా ఎంటర్ టైనర్స్ రాలేదు. ఇలాంటి టైం లో ఆడియన్స్ ముందు అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా వరుణ్ డాక్టర్… రిలీజ్ అయ్యే దాకా పెద్దగా ఎవరు పట్టించుకోని ఈ సినిమాలో కథ అంత బలంగా లేకున్నా కానీ…

కామెడీ వర్కౌట్ అవ్వడం ఒక్కటి ప్లస్ అయ్యి తెలుగు లో రోజు రోజుకి స్టడీ కలెక్షన్స్ తో థియేటర్స్ ని పెంచుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుంది. సినిమా మొదటి రోజు 22 లక్షల షేర్ ని రెండో రోజు 37 లక్షల షేర్ ని…

సొంతం చేసుకున్న తర్వాత మూడో రోజు వర్కింగ్ డే లో కూడా 24 లక్షల షేర్ ని అందుకోగా 4 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్నా కానీ కేవలం 4 లక్షల రేంజ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని 20 లక్షల షేర్ తో సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది.

మొత్తం మీద సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 28L
👉Ceeded: 13L
👉UA: 14L
👉East: 10L
👉West: 9L
👉Guntur: 10L
👉Krishna: 11L
👉Nellore: 8L
AP-TG Total:- 1.03CR(1.85CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు… సినిమాను తెలుగు లో…

1.35 కోట్ల రేటు కి అమ్మగా సినిమా మొత్తం మీద 1.6 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగింది. మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 57 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక తమిళ్ వర్షన్ తో వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్ 34 కోట్ల రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు…

Leave a Comment