న్యూస్

పింక్ 50, అజిత్ సినిమా 75, వకీల్ సాబ్ 100…కాచుకోండి ఇక అంటున్న దిల్ రాజు!

ఆల్ రెడీ ప్రూవ్ అయిన స్టొరీ ని రెండు రకాలుగా తీయొచ్చు, ఒకటి ఉన్నది ఉన్నట్లు తీసి ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఉంచటం, రెండోది ఉన్న స్టొరీ లో ఇంకొన్ని ఇంప్రూవ్ మెంట్స్ ని చేసి ఆడియన్స్ ఛాయిస్ కి తగ్గట్లు కథని మార్చడం, ఈ రెండో కోవలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఊహించని మార్పులతో ఒక కమర్షియల్ మూవీ టచ్ ఇస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని చెప్పాలి.

ఒరిజినల్ వర్షన్ అయిన పింక్ కంప్లీట్ గా సీరియస్ నోట్ తో సాగే సినిమా, ఇక ఇలాంటి సినిమాను రీమేక్ చేయడమే సాహసం అనుకుంటే తమిళ్ లో స్టార్ హీరో అజిత్ కుమార్ రీమేక్ చేయడమే కాదు అందులో రెండు ఫైట్ సీన్స్ కూడా పెట్టారు, కానీ కథ చాలా వరకు సీరియస్ గానే సాగింది..

కానీ సినిమా తెలుగు రీమేక్ కి వచ్చే సరికి లెక్క మొత్తం మారిపోయింది, పవర్ స్టార్ కంబ్యాక్ మూవీ గా మారడం తో సినిమా మూల కథని అలానే తీసుకుని ఛాన్స్ దొరికిన ప్రతీ ప్లేస్ లో సాలిడ్ గా హీరోయిజం ఎలివేట్ సీన్స్ ని ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ని పెట్టాడు డైరెక్టర్…

దాంతో వకీల్ సాబ్ ఇప్పుడు ఒక కమర్షియల్ మూవీలానే ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజు సినిమా రీమేక్ అయినా తెలుగు లో చాలా మార్పులు ఉన్నాయని, ఇక్కడ ఆడియన్స్ కి నచ్చేలా మార్పులు చేర్పులు చేశామని కానీ కోర్ పాయింట్ ని మార్చలేదని చెప్పుకొస్తు… పింక్ సినిమా కి…

ఓవరాల్ గా ఇది రెండో రీమేక్ కాబట్టి ఏ సినిమాకి ఎన్ని మార్కులు ఇస్తారు అని అడగ్గా, పింక్ కి 50, అజిత్ సినిమా నెర్కొండపార్వాయి కి 75 కానీ వకీల్ సాబ్ సినిమా కి 100 మార్కులు ఇవ్వొచ్చు అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు, నిర్మాత కాన్ఫిడెంట్స్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సినిమా రాంపేజ్ ఖాయంగా కనిపిస్తుంది.

Leave a Comment