న్యూస్

పుష్ప అల్లు అర్జున్ ఇంట్రో టీసర్ రివ్యూ…అరాచకం ఇది!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో ఆర్య సిరిస్ తర్వాత రూపొందుతున్న సినిమా పుష్ప, భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ లెవల్ లో ఉండగా సినిమా కొత్త పోస్టర్ లు రిలీజ్ అయిన ప్రతీ సారి కూడా అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా సినిమా లో అల్లు అర్జున్ క్యారక్టర్…

అయిన పుష్పరాజ్ ఇంట్రో ని టీసర్ గా రిలీజ్ చేశారు… కాగా క్యారెక్టర్ ఇంట్రో టీసర్ బాగా మెప్పించింది అని చెప్పాలి, ఫస్టఫాల్ ఇది రెగ్యులర్ అల్లు అర్జున్ మూవీస్ లా కాకుండా కంప్లీట్ మాస్ క్యారెక్టర్ తో రగ్గుడ్ లుక్ తో ఫారెస్ట్ నేపధ్యంలో గంధపుచెక్కల స్మగ్లింగ్ చుట్టూ…

అల్లుకున్న కథ గా రూపొందించా, సినిమా ఇంట్రో టీసర్ లో మొత్తం వాటి చుట్టూనే చూపెట్టగా.. పోలిస్ జీప్ అడవి లో ఎంటర్ అవ్వడం, సంకెళ్ళతో అల్లు అర్జున్ వాళ్ళ నుండి తప్పించుకోవాలని చూడటం, ఫైట్ సీన్ తో తప్పించుకోవడం, తర్వాత తన తెలివి తేటలతో గంధపుచెక్కల స్మగ్లింగ్ ని…

ఎలా చేశాడు అన్నది మొత్తం మీద ఇంట్రో టీసర్ లో చూపెట్టారు. అల్లు అర్జున్ రగ్గుడ్ లుక్ అండ్ ఫైట్ సీన్స్ లో దుమ్ము లేపాడు, ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా మెప్పించింది. ఇక విజువల్స్ టాప్ నాట్చ్ అనిపించే విధంగా మెప్పించాగా ఓవరాల్ గా క్యారెక్టర్ ఇంట్రో టీసర్ బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి.

ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్ ఓకే చెప్పడమే కాకుండా కంప్లీట్ డీ గ్లామైరాజ్ రోల్ లో ఇలాంటి మాస్ రఫ్ రగ్గుడ్ లుక్ లో కనిపించడానికి ఒప్పుకోవడం ఆ పాత్రకు న్యాయం చేయడం అల్లు అర్జున్ కే చెల్లింది, ఇక యూట్యూబ్ లో ఈ ఇంట్రో టీసర్ మొదటి 24 గంటల్లో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి ఇక..

Leave a Comment